• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ డైలాగ్స్ సూప‌ర్...

ఆ డైలాగ్స్ సూప‌ర్ హిట్‌..మ‌రి..ర‌జ‌నీ పొలిటికల్ డైలాగ్స్‌..?

By - Tupaki Desk
Update: 2017-12-31 10:30 GMT
ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఒక సూప‌ర్ స్టార్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాడా?  రాడా? అన్న సందేహాలు కంటిన్యూ కావ‌టం.. ఆ హైప్ అంతేలా కొన‌సాగ‌టం మామూలు విష‌యం కాదు. అది ర‌జ‌నీ విష‌యం నూటికి నూరుపాళ్లు నిజ‌మ‌య్యాయి. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి త‌మిళ సినిమాకు సూప‌ర్ స్టార్ గా కీర్తిని అందుకుంటున్న ర‌జ‌నీ లాంటి వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి వ‌స్తే స‌మాజానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. త‌మిళ‌నాడు రాష్ట్రం మ‌రింత ముందుకు వెళుతుంద‌న్న ఆశ‌లు చాలామందే వినిపిస్తుంటారు.

అయితే.. అభిమానులు త‌న‌ను రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎంత‌గా కోరుకున్నా.. ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టమే త‌ప్పించి.. నోరు తెరించింది ఒక్క మాట చెప్పింది లేదు. కానీ.. రాజ‌కీయాలంటే త‌న మ‌న‌సులో ఉన్న ఆస‌క్తిని.. కుతూహ‌లాన్ని త‌న సినిమాల్లో డైలాగ్స్ రూపంలో చెప్పేవారు. సినిమాల్లో ఆయ‌న పంచ్ డైలాగ్స్ తో ఆయ‌న అభిమానులే కాదు.. సినిమా అభిమానులు సైతం సంతోషాన్ని వ్య‌క్తం చేసేవారు.

వెండితెర వేల్పుగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు అందుకుంటున్న ర‌జ‌నీ.. త‌న సినిమాల్లో చెప్పిన పంచ్ డైలాగ్స్ ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అయ్యాయి. తాజా ప్ర‌క‌ట‌న‌తో ఆయ‌న రాజ‌కీయ జీవితం మొద‌లైన‌ట్లే. రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని.. సొంతంగా పార్టీ పెడ‌తాన‌ని చెప్పిన ర‌జ‌నీ.. వాటికి సంబంధించిన వివ‌రాల్ని ప్ర‌క‌టించ‌లేదు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి పార్టీని బ‌రిలోకి దించుతాన‌ని చెప్ప‌టం ద్వారా.. 2019 స్వార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు తాను దూరంగా ఉంటాన‌న్న విష‌యాన్ని చెప్పేశారు.

సినిమాల్లో ర‌జ‌నీ చెప్పిన పంచ్ డైలాగ్స్ కు ప్రేక్ష‌కులు ఎంతగా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారో తెలిసిందే. మ‌రి.. రాజ‌కీయ జీవితంలో ర‌జ‌నీ నోటి నుంచి వ‌చ్చే డైలాగులు మ‌రెంత హిట్ అవుతాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. రాజ‌కీయ ఎంట్రీ నేప‌థ్యంలో.. త‌న‌దైన శైలిలో చెప్పిన ర‌జ‌నీ సూప‌ర్ హిట్ డైలాగ్స్ ను ఒక్క‌సారి గుర్తు చేసుకోవ‌టం బాగుంటుంది.

+   నా దారి... రహదారి

+  నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే

+   నాన్న పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది

+   దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటిస్తాడు

+   అతిగా ఆశపడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు

+   పుట్టుకతో వచ్చింది.. ఎన్నటికీ పోదు

+   నాయకుడికి బంధం, బంధుత్వం ఒక్కటే.. ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు

+   ఒక పిరికివాడితో యుద్ధం చేయటం నాకు.. మానిక్ భాషాకి నచ్చదు

+   కష్టపడందే ఏదీ రాదు.. కష్టపడుకుండా వచ్చింది ఏదీ ఉండదు

+  పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదు.. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లరు.. ఇంకా దేనికయ్యా నీదీ నాదీ అనే స్వార్థం

+   తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత

+  ధనమంతా నీ దగ్గరే ఉంటే మనఃశాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావల్సినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తేనే మనఃశాంతి
Tags:    
  • Rajinikanth 
  • Rajinikanth Dialogues 
  • Political Entry 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS