ప్రియాంకకు నాకన్నా పెద్ద హెలిక్యాప్టరా?

Update: 2019-04-28 06:39 GMT
మూడో విడత ఎన్నికల పోలింగ్ సోమవారం ఆరంభం కానుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిపోయింది. ఎన్నికల హడావుడిలో ఉన్న నేతలందరూ సాయంత్రానికి ప్రచారం మొదలుపెట్టారు. మూడో విడతలో మొత్తం 9 రాష్ట్రాలు - 71 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

అయితే మూడోవిడత ముగింపు ప్రచారం రోజు ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఊపిరిసలపనంత షెడ్యూల్ ఉండడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వేర్వేరు బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొనడానికి హడావుడిగా బయలు దేరారు. హెలిప్యాడ్ వద్ద అన్నాచెల్లి  రాహుల్ ప్రియాంకలు కలిసి ఒకరి భుజాలపై ఒకరు చేయి వేసి అప్యాయంగా పలకరించుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. పైలెట్లతో గ్రూప్ ఫొటో దిగారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సరదాగా మాట్లాడారు.. తాను మంచి అన్నను అని.. ఎక్కువ దూరం - ఎక్కువ రాష్ట్రాలు తిరగాల్సిన నేను చిన్న హెలీక్యాప్టర్ ను వాడుతున్నానని..తక్కువ దూరం - ఒకే రాష్ట్రంలో ప్రచారం చేస్తోన్న నా చెల్లెలు పెద్ద హెలిక్యాప్టర్ లో తిరుగుతోంది.. ఆమె కోసం నేను పెద్ద హెలిక్యాప్టర్ ను త్యాగం చేశాను అని చెల్లిని ఆటపట్టించాడు రాహుల్. అనంతరం పరస్పరం అభినందనలు చెప్పుకొని వెల్లిపోయారు. వెళ్తూ వెళ్తూ గ్రూప్ ఫొటోలు కూడా దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


Full View

Tags:    

Similar News