డియర్ మందు బాబులు, మన ఊళ్ళోనే కొనండ్రా !

Update: 2020-09-04 11:30 GMT
ఏపీలో మద్యంపై రోజుకో రచ్చ జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం గతేడాది మద్య విధానం తీసుకొచ్చిన నాటి నుంచి మద్యం బాటిళ్లు, బ్రాండ్లు, వాటి ధరలపై చర్చ జరుగుతూనే ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను స్వాధీనం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం...ఇప్పుడుఆ  సంఖ్యను తగ్గిస్తూ ధరలు పెంచుతూ విక్రయాలు చేస్తుంది. మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే 33 శాతం షాపులను మూసేయడంతో పాటు 75 శాతం మేర ధరలు పెంచింది. తాజాగా ఛీఫ్‌ లిక్కర్‌, బీర్ల ధరలను తగ్గించి మిగతా ప్రీమియం బ్రాండ్ల ధరలన్నీ పెంచేసింది.

రాష్ట్రంలో పేదలు తాగే ఛీప్‌ లిక్కర్ బ్రాండ్ల ధరలను తగ్గించడం ద్వారా శానిటైజర్లు తాగి చనిపోతున్న వారి చావులను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కీలకం నిర్ణయం తీసుకుంది. దీంతో ఛీఫ్‌ లిక్కర్ సేవించే వారికి కాస్త ఊరట దక్కింది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై వైసీపీ ప్రభుత్వంతో పాటు నేతల్లోనూ కొంచెం  సానుకూలత వ్యక్తమవుతోంది. ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగడంతో ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మద్యం తెప్పించుకుని తాగుతున్నారు మందుబాబులు. ఈ మధ్య హైకోర్టు వేరే రాష్ట్రం నుంచి మూడు ఫుల్ బాటిళ్లు తెచ్చుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది.

వైసీపీ ప్రభుత్వం తాజాగా మద్యం ధరలు తగ్గించింది కాబట్టి ఇక పొరుగు రాష్ట్రాలకు వెళ్లి కొనొద్దని, ఇక్కడే కొనడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని వైసీపీ నేత మందుబాబులకు సలహా ఇచ్చారు.  "మందుబాబులు, కాస్త మన ఊళ్ళోనే కొనండ్రా!! ఆదాయం మన ఆంధ్రాకి ఇద్దాం.. పన్నులు తగ్గించారు, ఇక అంతా ఒకటే రేటు. కష్టకాలం అని ఎక్కువ తాగితే ఆరోగ్యానికే బొక్క. జర పైలం సుమీ..’’ అని ఆయన ట్వీట్ చేశారు
Tags:    

Similar News