• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇందిరమ్మే వందనం చేసిన...

ఇందిరమ్మే వందనం చేసిన పూసపాటి వైభవం.

By - Tupaki Desk
Update: 2022-05-02 00:30 GMT
విజయనగరం జిల్లాకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. పూసపాటి రాజులు వందల ఏళ్ళుగా ఇక్కడ సంస్థానాలను  ఏర్పాటు చేసుకుని జనాలను పాలించారు. ఇక రాచరికం పోయి ఆధునిక వ్యవస్థ వచ్చిన తరువాత కూడా దానిని గౌరవిస్తూ చట్ట సభల ద్వారా నెగ్గి తమ సత్తా చాటుకున్న చరిత్ర కూడా పూసపాటి వారిదే. అలాంటి వంశీకులులో రాజకీయంగా  రాణించిన తొలి తరం వారు పీవీజీ రాజు. ఆయన తన ఆస్తులను మొత్తం ప్రజలకు దారాదత్తం చేశారు. ఎన్నో సామాజిక హితమైన కార్యక్రమాలకు వాటిని వెచ్చించి అందరి బాగు కోరుకున్నారు.

ఆయన సోషలిస్ట్ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత కాలంలో ఆయన కాంగ్రెస్ లో చేరి పలుమార్లు ఎంపీ అయ్యారు. ఇక ఆయన వస్తూంటే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎదురేగి తల వంచి మరీ వందనం చేయడం చరిత్ర మరచిపోదు. అది ఆయనకూ, ఆయన వంశానికి ఉన్న గౌరవంగా అంతా చెప్పుకుంటారు.

ఆయన వారసులుగా కుమారులు ఆనందగజపతిరాజు, అశోక్ గజపతి రాజు రాజకీయాల్లో రాణించారు. ఇవన్నీ ఇలా ఉంటే అశోక్ గజపతిరాజుని అకస్మాత్తుగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తప్పించడం, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా కూడా పక్కన పెట్టడం ఈ మధ్య జరిగిన పరిణామాలు. అంతే కాదు ఆయనను పట్టుకుని వైసీపీ మంత్రులు ఎన్నో విధాలుగా నిందించారు.

ఇక మాన్సాస్ ట్రస్ట్ ద్వారా నడిచే విద్యా సంస్థలను ఇబ్బంది పెట్టడం, ఎంతో మందికి విద్యా దానం చేసిన ఎమ్మార్ కాలేజీని నాన్ ఎయిడెడ్ గా చేసి ప్రైవేట్ పరం చేయడం వంటివి ఈ మధ్యనే జరిగాయి. ఇక తనను ప్రభుత్వ పెద్దలు అవమానించారని పలు మార్లు అశోక్ మీడియా ముందు ఆవేదన చెందిన సందర్భాన్ని అంతా చూశారు. తాను చైర్మన్ గా ఉన్న రామతీర్ధం దేవాలయానికి లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వబోతే సర్కార్ పెద్దలు కాదని పక్కన పెట్టారని కూడా ఆయన కలత చెందారు.

తన మీద కేసులు పెట్టాలని చూస్తున్నారని కూడా పీవీజీ రాజు కుమారుడు అశోక్ బాధపడడం కూడా నడుస్తున్న చరిత్ర. మరి దేశానికి అత్యంత శక్తివంతురాలు అయిన మహిళగా ఉన్న ఇందిరాగాంధీ పూసపాటి వంశీకులను గౌరవించడం నిన్నటి చరిత్ర అయితే వారి మీద నోరు పారేసుకుని నానా విధాలుగా అవమానించడం నేటి పాలకుల దుర్నీతి అని చెబుతున్నారు. ఇలా  అన్నీ చూసిన విజయనగరం జనాలు ఆవేదన చెందుతున్నారు.

ఇదంతా ఎందుకంటే మే 1 పీవీజీ రాజు జయంతి.  ఆయన 1924 మే 1న జన్మించారు. 1995 నవంబర్ 14న 71 ఏళ్ల వయసులో తనువు చాలించారు. ఆయన నెలకొల్పించే మాన్సాస్ సంస్థ. మరి ఆ మహానుభావుడు జయంతి వేళ మాన్సాస్ మీద ఈ మధ్య కాలంలో జరిగిన దాడులను తలచుకుని అభిమాన జనం తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. మన్నించు మహరాజా అంటున్నారు. రాజులే పోయినా రాజ్యాలు కూలినా నీ కోట వైభవం మాత్రం అలాగే ఉంటుంది. ప్రస్తుతం జరిగేవన్నీ తాత్కాలికమే సుమా అని వారికి వారే ఓదార్చుకుంటూ పీవీజీ రాజుకు ఘన నివాళి అర్పిస్తున్నారు.
Tags:    
  • PVG Raju 
  • Vizainagaram 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS