బాబుకు చెక్ చెప్పేందుకే చిన్నమ్మను తీసుకొచ్చారా?
కొంతమంది నాయకుల మీద విపరీతమైన అంచనాలు ఉంటాయి. నిజానికి వారు.. ఆ అంచనాలకు అర్హత ఉన్నవారే. కానీ.. దురదృష్టవశాత్తు అలాంటి వారు తమపై ఉన్న అంచనాలకు తగ్గట్లు అస్సలు స్పందించరు. రాష్ట్ర విభజన వ్యవహారంలో మిగిలిన కాంగ్రెస్ నేతలకు.. నాటి కాంగ్రెస్ నేత.. కేంద్రమంత్రి అయిన దగ్గుబాటి పురంధేశ్వరి ఒకరు.
ఘనమైన వారసత్వం ఉన్న ఆమెపై చాలామంది సీమాంధ్రులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయినప్పటికీ విభజనకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పింది లేదు. తూతూమంత్రంగా రెండు మాటలు చెప్పేసి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి.. బీజేపీలోకి వెళ్లిపోయారు.
బీజేపీలో ఆమెకు పెద్దపీట వేస్తారన్న ప్రచారం జరిగినా అంతగా ఒరిగిందేమీ లేదన్న మాట వినిపిస్తుంటుంది. అయితే.. భవిష్యత్తు అవసరాల కోసమే పురంధేశ్వరికి ప్రస్తుతం పరీక్షా కాలం నడుస్తుందని వాదించేవారు లేకపోలేదు. ఇలాంటి వారి మాటల్ని నిజం చేస్తూ.. పురంధేశ్వరికి బీజేపీ కొత్త బాధ్యతను అప్పజెప్పింది.
బీజేపీ భారీ ఎత్తున ప్రచారం చేపట్టబోయే జన సంపర్క్.. మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాలకు పురంధేశ్వరిని కన్వీనర్‌గా నియమించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత ఈ ప్రచారాన్ని మొదలుపెట్టే వీలుంది.
ఏపీకి కేంద్రం నుంచి పెద్దఎత్తుననిధులు వస్తున్నా.. అందుకు తగ్గ ప్రచారం ఏపీలో జరగటం లేదని.. ఏపీ అభివృద్ధికి కేంద్రం అనుసరిస్తున్న విధానల గురించి చెప్పే నేతలు కరువయ్యారన్న విమర్శ వినిపిస్తోంది. విభజన కారణంగా నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు కేంద్రం ఏ స్థాయిలో ఆదుకుంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటం.. ప్రచారం చేయటమే లక్ష్యంగా పురంధేశ్వరి చేత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.
కేంద్రంతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ.. ఏపీలో తన ఉనికిని చాటుకోవటానికి తహతహలాడటంతో పాటు.. పురంధేశ్వరిని తెరపైకి తీసుకురావటం చూసినప్పుడు.. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు చెక్ చెప్పేంత సీన్.. చిన్నమ్మకు ఉందా..?