మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం .. గుట్టు బయటపెట్టిన పోలీసులు

Update: 2021-01-10 01:30 GMT
హైదరాబాద్ లో  మసాజ్ సెంటర్ ముసుగు లో  వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు అందిన  సమాచారంతో సైఫాబాద్ పోలీసులు అర్ధరాత్రి సమయంలో మెరుపు దాడి నిర్వహించి ఆ ముఠా గుట్టు బయటపెట్టారు. ఖైరతాబాద్ పరిధిలోని ఎసీ గార్డ్స్ ‌లో అట్లాంటిక్‌ హాస్పిటాలిటీ ఫిజియోథెరఫీ క్లినిక్‌ పేరుతో మసాజ్‌ సెంటర్‌ కొనసాగుతోంది. అయితే కొద్దిరోజులుగా అందులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

దీనితో  గురువారం రాత్రి డీఐ రాజునాయక్‌ సిబ్బందితో ఆ క్లినిక్ ‌లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా విటులు, యువతులతో పాటు నిర్వాహకురాలు మెహరాజున్నీసా ను అదుపులోకి తీసుకున్నారు. మెహరాజున్నీసా గతంలో మెహిదీపట్నంలోని ఓ మసాజ్‌ సెంటర్‌ లో  రిసెప్షనిస్ట్‌ గా పనిచేసింది. యజమాని దానిని అమ్మేయడంతో తాను కొనుగోలు చేసి యజమానిగా మారింది.ఆ మసాజ్ సెంటర్‌ నష్టాల్లో కొనసాగడంతో వ్యభిచార కేంద్రంగా మార్చేసింది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తోందని పోలీసులు వెల్లడించారు.  నిందితుల నుంచి 5 సెల్‌ఫోన్లు, నగదు, స్వైపింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు
Tags:    

Similar News