ప్రశాంత్ కిషోర్‌కు తిక్క ఉందా? దానికి లెక్క ఇదేనా?

Update: 2021-12-20 12:03 GMT
రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్‌కు తిక్క ఉందా?  ఆయ‌న మాట్లాడేదానికి పొంతన లేకుండా పోయిం దా?  వారినికో విధంగా ఆయ‌న మాట్లాడుతున్నాడా?  అంటే.. ఔన‌నే అంటున్నారు జాతీయ‌స్థాయి రాజ‌కీ య విశ్లేష‌కులు. ఇటీవ‌ల కాలంలో ప్ర‌శాంత్ కిషోర్‌.. చేస్తున్న విమ‌ర్శ‌లు,, చేస్తున్న వ్యాఖ్య‌లు.. ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఆయ‌న ఏం చేస్తున్నాడు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా 2014లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఐఐటీయెన్ ప్ర‌శాంత్ కిషోర్.. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఏదో ఒక పార్టీకి అంట‌కాగుతూ.. స‌ల‌హాలు ఇస్తుంటారు.

గ‌తంలో మోడీ, జ‌గ‌న్‌, బిహార్ సీఎం నితీష్ కుమార్‌, ఇటీవ‌ల జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో.. మ‌మ‌తా బెన‌ర్జీకి ఆయ‌న స‌ల‌హాలు ఇచ్చారు. అయితే.. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు విశ్లేష‌కుల‌ను కూడా త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురి చేస్తున్నాయి. ఆయ‌న అస‌లు ఏం మాట్లాడుతున్నాడు? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం పీకే రాజ‌కీయాలు వ‌చ్చే 2024 జాతీయ ఎన్నిక‌ల‌పై ప‌డ్డాయి. ఇప్పుడు ఆయ‌న క‌ర్త‌వ్యం ఏంటంటే.. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త‌ను జాతీయ‌స్థాయిలో ఫోక‌స్ చేయ‌డ‌మే!

ఆమెను మించిన సార‌థి లేదంటూ.. పీకే ఈమ‌ధ్య వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పోనీ.. ఇదే మాట‌ల‌పై ఆయ‌న క‌ట్టుబ‌డుతున్నారా? అంటే.. అది కూడా లేదు. మ‌ధ్య మ‌ద్య కాంగ్రెస్‌ను తిట్ట‌డం.. మ‌ళ్లీ అదే కాంగ్రెస్‌ను పొగ‌డ‌డం.. చేస్తున్నారు. దీంతో పీకేపై అస‌లు విశ్వ‌స‌నీయ‌తే పోతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి 50 సీట్లు కూడా లేని.. మ‌మతాబెన‌ర్జీని నేష‌న‌ల్ లీడ‌ర్‌గా పీకే ఫోక‌స్ చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిజానికి ఆమెకు.. ఒక్క బెంగాల్‌లో త‌ప్ప‌.. లేదా.. అసోం.. వంటి ఈశాన్య ప్రాంతాల్లో త‌ప్ప‌.. పెద్ద‌గా ఫాలోయింగ్ లేదు.

మ‌రీ ముఖ్యంగా హిందీ బెల్ట్ అయిన‌..ఉత్త‌రాదిలో 0.1 శాతం కూడా మ‌మ‌తా బెన‌ర్జీకి ఫాలోయింగ్ లేదు. ఇక‌, ప్రాంతీయ భాష‌లు మాట్లాడే.. త‌మిళ‌నాడు,ఏపీ, తెలంగాణ‌, ఒడిసా, క‌ర్ణాట‌క‌, కేర‌ళ వంటి రాష్ట్రాల్లో అస‌లు మ‌మ‌త అంటే.. ఎవ‌రికీ తెలియ‌దు. మ‌రి అలాంటి నాయ‌కురాలిని జాతీయ‌స్థాయిలో ఫోక‌స్ చేయ‌డం అంటే.. పీకే కే తెలియాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు 53 సీట్లు ఉన్నాయి. పైగా.. నేష‌న‌ల్ లెవిల్లో.. ఈ పార్టీకి 20 శాతం ఓటు బ్యాంకు కూడా ఉంది. అయిన్ప‌టికీ.. ఆయ‌న కాంగ్రెస్‌పై త‌డ‌వ‌కోర‌కంగా మాట్లాడుతున్నాడు.

యూపీఏ అస‌లు ఎక్క‌డ ఉంది? అనే కామెంట్లు చేస్తున్నాడు పీకే.  హిందీ బెల్ట్‌లోనూ.. కాంగ్రెస్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా పీకే వ్యాఖ్యానించాడు. కానీ, ఇంత‌లోనే మ‌ళ్లీఈ గొంతు స‌వ‌రించుకుని.. కాంగ్రెస్ లేని ప్ర‌తిప‌క్షం ఎక్క‌డ ఉంటుంది? అని చెప్పుకొచ్చాడు. అంటే.. ఇటు మ‌మ‌త‌ను జాతీయ‌స్థాయిలో ఫోక‌స్ చేయాల‌న్న ఉబ‌లాటం ఉన్నా.. ఆ పార్టీకి ఫాలోయింగ్ లేద‌న్న విష‌యం తెలిసి.. ఏం చేయాలో తెలియ‌క ఇలా వ్యాఖ్యానిస్తున్నాడ‌నే కామెంట్లు వ‌స్తున్నాయి.

అదేస‌మ‌యంలో కాంగ్రెస్‌కు ఏమీ లేద‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు గుర్తుకు వ‌చ్చి.. మ‌ళ్లీ మాట మారుస్తున్నాడ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి పీకే విష‌యం.. త‌న‌ను తాను క‌న్ఫ్యూ జ్ చేసుకుని.. పార్టీల‌ను నేత‌ల‌ను కూడా క‌న్ఫ్యూజ్ చేయ‌డ‌మే ప‌నిగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 
Tags:    

Similar News