• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వీధి పోరాటాల‌కు...

వీధి పోరాటాల‌కు స్వ‌స్తి.. టీఆర్ ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీ.. స‌భా స‌మ‌ర‌మే!

By - Tupaki Desk
Update: 2021-09-23 05:24 GMT
తెలంగాణ‌లో ఇప్ప‌టికే హీటెక్కిన రాజ‌కీయాలు.. మ‌రింత మ‌స‌లనున్నాయా?  ఇప్ప‌టి వ‌ర‌కు వీధి పోరాటాలు.. ఒక‌రిపై ఒక‌రు ట్విట్ట‌ర్ యుద్ధాలు.. వ్యాఖ్య‌ల మంట‌లు రాజేసుకున్న నాయ‌కుల‌కు శుక్ర‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ.. మ‌రో ప్ర‌ధాన పోరాట వేదిక కానుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలంగాణ‌ శాసన సభ, శాసన మండలి సమావేశాలు శుక్ర‌వారం నుంచి ఆరంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఈసారి సమావేశాలు వారం రోజుల పాటు సాగే అవకాశముంది. వాస్తవానికి గత అసెంబ్లీ సమావేశాలు మార్చి 15న ప్రారంభమై, 26వ తేదీతో ముగిశాయి. అప్పటి నుంచి ఆరు నెలల్లోగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అందుకే ఈ నెల 16న సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి... 24 నుంచి శాసన సభా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.

ప్ర‌భుత్వం ఓ రకంగా.. విపక్షాలు మ‌రోర‌కంగా..

అసెంబ్లీ స‌మావేశాలు ఈసారి మ‌రింత కాగ‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ సమావేశాలు 24న ప్రారంభమై, అక్టోబరు 1 వరకు కొనసాగే అవకాశముంది.  దళిత బంధు పథకానికి కొత్త చట్టాన్ని తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందనుంది. అయితే... బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత జరిగే చర్చ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో దళిత బంధు పథకంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. దళిత బంధు పథకం మాదిరిగానే గిరిజన బంధు, బీసీ, మైనారిటీ బంధు వంటి పథకాలను ప్రవేశపెట్టాలంటూ ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్న తరుణంలో ప్రతిపక్షాల నేతలు గట్టిగానే వాదించే అవకాశముంది.

బిల్లుల కోస‌మే..

రాష్ట్రంలో హార్టికల్చర్‌, ఫారెస్ట్‌ కోర్సులను ప్రారంభించడానికి వీలుగా ‘కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ(అమెండ్‌మెంట్‌) బిల్లు-2021’ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్‌ బోర్డును వ్యాపార సంస్థగా పరిగణించకుండా... ‘హౌసింగ్‌ బోర్డు యాక్ట్‌-1956’లోని సెక్షన్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 25న ‘ది తెలంగాణ హౌసింగ్‌ బోర్డు(అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌-2021’ను తీసుకొచ్చింది. దీనిని బిల్లు రూపంలో సభలో ప్రవేశపెట్టి సవరణ చట్టాన్ని తీసుకురానుంది. పర్యాటక ప్రదేశాలకు సంబంధించి ఒక బిల్లు, ఇతర అంశాలపై మరో నాలుగు బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలిసింది.

రాజ‌కీయ దుమారం ఖాయం!

ఇప్పుడు అసెంబ్లీ వేదిక‌.. రాజ‌కీయ దుమారం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇటీవ‌లే రేవంత్ చేసిన డ్ర‌గ్స్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ ప‌రువు న‌ష్టం దావా వేయ‌డం..దీనిపై స్థానిక కోర్టు రూ.కోటి జ‌రిమానా విధించ‌డం.. వంటివాటిని కాంగ్రెస్ ఆయుధంగా చేసుకునే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ద‌ళిత బంధ‌ను తీసుకువ‌చ్చార‌ని.. త‌ర‌చుగా విమ‌ర్శిస్తున్న బీజేపీ దీనిని హైల‌ట్ చేయ‌నుంది. అదేస‌మ‌యంలో కాంగ్రెస్, బీజేపీలు సంయుక్తంగా లేవ‌నెత్తే మ‌రికొన్ని అంశాలు కూడా అధికార పార్టీకి ఇబ్బంది పెట్ట‌నున్నాయ‌ని అంటున్నారు. ముఖ్యంగా మంత్రి మ‌ల్లారెడ్డి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ధానంగా ప్ర‌స్తావించే అవ‌కాశంఉంది. అయితే.. దీనికి దీటుగా అధికార పార్టీ  కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. సో.. ఎలా చూసినా.. ఈ స‌భ‌.. స‌మ‌రాంగ‌ణాన్ని త‌ల‌పించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    
  • telangana 
  • kcr 
  • trs Party 
  • Telangana Assembly 
  • Telangana Assembly sessions 
  • Political News 
  • Breaking News 
  • Latest News 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS