• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జ‌య‌రాం మ‌ర్డ‌ర్‌...సీఐపై...

జ‌య‌రాం మ‌ర్డ‌ర్‌...సీఐపై వేటు...వాళ్ల‌పై విచార‌ణ‌

By - Tupaki Desk
Update: 2019-02-17 04:00 GMT
ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మూడు రోజుల్లో కొన్ని కీలక విషయాలు రాబట్టిన పోలీసులు.. ఇక ఈ వారం రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకి తెస్తారని భావిస్తున్నారు. అయితే, జయరాం హత్య కేసులో మరో పోలీసు అధికారిపై వేటు పడింది. రాయదుర్గం సీఐ రాంబాబును హెడ్‌ క్వార్టర్స్‌ కు బదిలీ చేస్తూ పోలీస్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బంజారాహిల్స్ ఏసీపీ టీమ్...ఇప్పటికే కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు ప్రధాన నిందితుడైన రాకేష్‌ రెడ్డి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. మరింత లోతైన దర్యాప్తు కోసం రాకేష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ ను మరో ఎనిమిది రోజుల పాటు తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం... జయరాం హత్య కేసులో నిందితులైన రాకేష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ కు ఈ నెల 23వ  వరకు పోలీసు కస్టడీ పొడిగించింది. మరోవైపు నిన్నటితో నిందితుల పోలీసు కస్టడీ ముగియడంతో... ఇవాళ ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంరతం నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.

ఇదిలాఉండ‌గా, జయరాంను హత్య చేశాక రాకేష్‌ రెడ్డి మొదట కాల్‌ చేసింది రాయదుర్గం సీఐ రాంబాబుకేనని పోలీసులు గుర్తించారు. ఫోన్‌ చేసిన తర్వాత కూడా నిందితుడిని పట్టుకోవడంలో విఫలమైనందుకు రాంబాబుపై వేటు వేసింది. ఇప్పటి వరకు జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు పడింది. మరోవైపు.. రాకేష్‌ తో టచ్‌ లో ఉన్న సీఐ శ్రీనివాస్‌, ఏసీపీ మల్లారెడ్డిలను సోమవారం విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. జయరాం హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసేందుకు వీరు ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ పోలీసుల‌ను ద‌ర్యాప్తు చేసిన త‌ర్వాత మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది.  
    

Tags:    
  • Jayaram Murder Case 
  • Latest News 
  • rakesh Reddy 
  • Telugu News 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS