• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాహుల్ ను పవన్ టార్గెట్...

రాహుల్ ను పవన్ టార్గెట్ చేశారా?

By - Tupaki Desk
Update: 2016-02-02 04:51 GMT
కాపు ఐక్య గర్జన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియాక్ట్ కావటం తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడేందుకు కేరళ నుంచి హైదరాబాద్ వచ్చిన పవన్.. ఒక అంశంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు చేయటం గమనార్హం.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై స్పందించి.. ఇప్పటికి రెండుసార్లు రాహుల్ హైదరాబాద్ కు రావటం తెలిసిందే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య మీద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు గా నిలవటంతో  పాటు.. కేంద్ర సర్కారుపై దునుమాడిన వైనం తెలిసిందే.

ఒక విద్యార్థి ఆత్మహత్యపై కాంగ్రెస్ యువరాజు లాంటి వ్యక్తి అంతలా రియాక్ట్ కావటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. అయితే.. ఈ ఉదంతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని రాజకీయంగా దెబ్బ తీసే అవకాశం ఉండటం.. తన సొంత నియోజకవర్గమైన అమేధీలో ఆమె చేస్తున్న హడావుడికి చెక్ పెట్టే పనిలో భాగంగా రాహుల్ ఇంతలా రియాక్ట్ అవుతున్నారన్న విమర్శలు వినిపించాయి.

ఇదిలా ఉంటే.. తుని ఇష్యూ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై రియాక్ట్ అయ్యారు. ఈ అంశం మీద మాట్లాడుతూ.. రోహిత్ లాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటంపై ఆవేదనను వ్యక్తం చేసిన పవన్..  వర్సిటీలో కులరాజకీయాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయన్న విషయాన్ని చెప్పేశారు.

పాఠాలు చెప్పాల్సిన ప్రొఫెసర్లు.. క్యాస్ట్ టూర్లకు తీసుకెళుతన్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. రోహిత్ ఇష్యూపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి తాను రాజకీయాలు చేయదలుచుకోలేనని తేల్చి చెప్పారు. యూనివర్సిటీలో కుల రాజకీయాలు రెండు.. మూడేళ్ల కాలంలో పుట్టవని.. ఎన్నో ఏళ్లుగా ఉన్నాయన్న విషయాన్ని తేల్చారు. రోహిత్ ఇష్యూలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లటం లేదని చెప్పటం ద్వారా.. వర్సిటీ రాజకీయాల పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు.

రోహిత్ ఇష్యూ వర్సిటీ స్థాయి వ్యవహారంగా తన మాటలతో చెప్పేసిన పవన్... రాహుల్ లాంటి జాతీయ నేత ఇలాంటి విషయం మీదన అవసరానికి మించిన అత్యుత్సాహాన్ని ప్రదర్శించాన్న విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లైంది. కుల రాజకీయాలు రెండు మూడేళ్ల నుంచి మొదలు కావని చెప్పటం ద్వారా.. ఇలాంటి ఉదంతాల్లో గత ప్రభుత్వాల పాత్రను పవన్ చెప్పకనే చెప్పినట్లైందని చెప్పాలి.
Tags:    
  • Pawan kalyan 
  • Rahul Gandhi 
  • HCU 
  • Telugu NEws 

Similar News

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS