• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మెగా ఫ్యామిలీకి ‘రద్దు’...

మెగా ఫ్యామిలీకి ‘రద్దు’ సెగ

By - Tupaki Desk
Update: 2016-11-21 07:45 GMT
తెలుగు చిత్రపరిశ్రమలో బలమైన కటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. అభిమానుల బేస్ తో పాటు.. ప్రజాదరణ విషయంలో వారికి వారే. మిగిలిన సినీ దిగ్గజ ఫ్యామిలీలు ఉన్నా..మెగా కాంపౌండ్ నుంచే పలువురు కథానాయకులే కాదు.. కథానాయికిగా నాగబాబు కుమార్తె తెరంగ్రేటం చేయటాన్ని మర్చిపోలేం. సినిమాకు మాత్రమే పరిమితం కాకుండా.. చిరు ప్రజారాజ్యం మొదలెట్టి.. కాంగ్రెస్ లో కలిపేస్తే.. పవన్ జనసేన అంటూ తనదైన పార్టీని పెట్టి.. దాని విస్తరణ పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.

పవన్ ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టారో.. మెగా అభిమానులకు పెద్ద ధర్మసంకటం ఎదురైంది. అంతకు ముందు వరకూ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా.. వారందరిని టోకుగా అభిమానించి.. ఆరాధించటం ఒక అలవాటుగా చేసుకొన్న మెగా ఫ్యాన్స్ కి పొలిటికల్ ఇష్యూస్ వచ్చాక తిప్పలు మొదలయ్యాయి. పవన్ జనసేనతో ఇది మరింత పెరిగింది.

ఇలాంటి కన్ఫ్యూజన్లు సరిపోవన్నట్లు తాజాగా మరో ఇబ్బంది ఎదురైంది. మోడీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు ఎపిసోడ్ పై ఇంతకాలం మౌనంగా ఉన్న మెగా బ్రదర్స్.. ఇంచుమించు కొద్ది గంటల వ్యవధిలో భిన్న కోణాల్లో ఇష్యూను చూడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చిరంజీవికి సంబంధించిన వ్యవహారాల్ని చూసే విషయంలో నాగబాబు చురుగ్గా ఉన్నా.. పవన్ కు సన్నిహితమైనా.. చాలా విషయాల్లో ఆయన తన మాట ఏదీ బయటకు చెప్పకుండా బండి లాగించేవారు. అలాంటిది.. ఓపెన్ గా మాట్లాడేస్తానంటూ.. మోడీ రద్దు నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మోడీని అసలుసిసలు మగాడి.. మొనగాడిగా అభివర్ణించటమే కాదు.. తన దృక్ఫదంలో మోడీ తీసుకున్న రద్దు నిర్ణయం సూపర్ అంటూ పొగిడేశారు. అదే సమయంలో..  నాగబాబు తమ్ముడు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా.. రద్దు అంశంపై కసరత్తు చేయకుండా.. హడావుడిగా.. ఎలాంటి ప్లానింగ్ లేకుండా నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తుందంటూ విమర్శ చేశారు. కేవలం గంటల వ్యవధిలో ఇలా రెండు భిన్నమైన వెర్షన్లు మెగా కాంపౌండ్ నుంచి రావటం.. మెగా అభిమానులకు ఇప్పుడు కొత్త పరీక్షగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Pawan kalyan 
  • Nagababu 
  • High Value Notes Ban 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS