• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా వ్యాప్తికి అమ్మాయిల...

కరోనా వ్యాప్తికి అమ్మాయిల పొట్టి దుస్తులే కారణమట ...!

By - Tupaki Desk
Update: 2020-04-28 01:30 GMT
కరోనా వైరస్ ... చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే, క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఆ వైర‌స్ ‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఓ మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో కొంద‌రు క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అమ్మాయిలే కార‌ణ‌మంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తికి అమ్మాయిలే కారణం అంటూ ఓ మ‌తానికి చెందిన పెద్ద మ‌నిషి ఒక‌రు వివాదాస్పాద వ్యాఖ్య‌లు చేశారు.

అమ్మాయిలు పొట్టి డ్రెస్‌ లు వేసుకోవడం వల్లే వైరస్ సోకిందని, వారి వల్లే పాకుతోందని పాక్ మత పెద్ద మౌలానా తారీఖ్ జమీల్ మాట్లాడారు. ఆయన ఈ వ్యాఖ్యలు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే అనడం సంచలనానికి దారి తీసింది. ఎసాహ్ టెలెథాన్ ఫండింగ్ సదస్సులో జమీల్, ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమీల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా, పాకిస్తాన్ ‌లోనూ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఆ దేశంలో 15 వేల మందికి పైగా కరోనా వ్యాధి బారిన పడ్డారు.

సరైన వైద్య వసతులు లేకపోవడంతో వైద్యులు కరోనా రోగులకు చికిత్స అందించేందుకు జంకుతున్నారు. ఇటువంటి త‌రుణంలో జ‌మీల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కొందరికి కరోనాను అంటిపెట్టి మాట్లాడటం ఎంత వరకు సబబు అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోబోనని జమీల్ చెప్పడం గమనార్హం.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • international news 
  • pakistan 
  • Maulana Tharik Jameel Comments On Girls Dresses 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS