ఒకే జాతి ఒకే కార్డు.. ప్రారంభించిన మోదీ.. ఈ కార్డుతో లాభాలేవే..!

Update: 2020-12-29 23:30 GMT
మోదీ ప్రధాని అయ్యాక పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మెకిన్​ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛభారత్​ వంటి నిర్ణయాలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. నోట్లరద్దు, జీఎస్టీ వంటి వాటిపై విమర్శలు కూడా వచ్చాయి అదే వేరే విషయం. అయితే పలు రకాల సేవలను కూడా ఒకే గొడుగుకిందకు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నది. ఇప్పటికే వన్​ నేషన్​.. వన్​ రేషన్​ కార్డు, వన్​ నేషన్​.. వన్​ ఎలక్షన్​, వన్​ నేషన్​.. వన్​ మార్కెట్​లకు కూడా రూపకల్పన చేసింది.

అయితే ఓ వైపు వ్యవసాయచట్టాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నది. ఇదిలా ఉంటే.. మంగళవారం ప్రధాని మోదీ.. ఢిల్లీలో నేషనల్​ కామన్​ మొబిలిటీ కార్డును ప్రారంభించారు. వన్​ నేషన్​ వన్​ కార్డు నినాదంలో భాగంగా దీన్ని లాంచ్​ చేసినట్టు సమాచారం.  
అయితే ఈ కార్డుతో ఢిల్లీకి చెందిన ప్రయాణికులు మెట్రోరైళ్లు, సబర్బన్​ రైళ్లు, బస్సుల్లో ప్రయాణించవచ్చు. టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఈ కార్డును నెల నెల రీచార్జి చేసుకొంటే సరిపోతుంది. ఈ కార్డును మొబైల్​ ఫోన్​కు అనుసంధానం కూడా చేసుకోవచ్చు. డిజిటల్​ ఇండియాలో భాగంగా ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. మెట్రో స్టేషన్ ఎంట్రీ పాయింట్ వద్ద ఉండే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్ దగ్గర చెల్లింపులు జరపవచ్చు.


ఎన్‌సీఎంసీ విధానం ద్వారా రైళ్లు,బస్సుల్లో చెల్లింపుల కోసం రూపే, డెబిట్ కార్డులను కూడా ఉపయోగించవచ్చు. గత 18 నెలల్లో దేశంలోని 23 బ్యాంకులు జారీ చేసిన ఏ రూపే కార్డుతోనైనా ఈ సదుపాయం పొందవచ్చు. డిజిటల్​ లావాదేవీలు పెంచేందుకు ప్రజలకు శ్రమ తగ్గించేందుకు ఈ కార్డు ఎంతో ఉపయోగపడనున్నది. త్వరలో ఈ సేవలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయి.
Tags:    

Similar News