వివేకా కేసులో కూతురి పిటిష‌న్‌ తో ఏం జ‌ర‌గ‌నుంది?

Update: 2020-01-28 16:39 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్య కేసు విచార‌ణ మ‌లుపులు తిరుగుతోంది. 2019 మార్చి 14వ తేదీన తన ఇంట్లోనే వివేకా దారుణంగా హత్యకు గురయిన సంగ‌తి తెలిసిందే. ఈ హత్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం సిట్ ద్వారా దర్యాప్తు చేయించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరో సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే - వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయ‌న కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా సీబీఐ - ఏపీ హోం శాఖను చేర్చారు.

ఇప్పటికే వివేకా హ‌త్య కేసును సీబీఐకి ఇవ్వాలని వైఎస్ జగన్ - వివేకా భార్య సౌభాగ్యమ్మ - ఎమ్మెల్సీ బీటెక్ రవి - ఆదినారాయణ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు కొత్తగా నాలుగో పిటిషన్ వివేకా కుమార్తె సునీత వేశారు. అన్ని పిటిషన్లపై నేడు ధర్మాసనం విచారణ జరపనుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  ఈ హత్య కేసును సిట్ విచారిస్తోంది. ఈ సిట్ బృందం కూడ ఈ కేసును కూడ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే టీడీపీ - వైసీపీకి చెందిన నేతలను విచారించింది. అయితే కేసు విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే కోర్టుకి తెలిపింది.

ఇదిలా ఉండ‌గా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఘాటుగా స్పందించారు. వైఎస్‌ వివేకానందరెడ్డి మృతికి సంబంధించి టీడీపీపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎక్కడో జరిగిన దాన్ని...తమకు ఆపాదించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. మొదట గుండె పోటు అని ప్రకటించి.. ఆ తర్వాత అనుమానాస్పద మరణం అంటూ మార్చి తమపై విమర్శలు చేస్తున్నారని  అన్నారు. జగన్‌ పై జరిగిన దాడి కేసులోనూ తనపై ఇటువంటి ఆరోపణలే చేశారని గుర్తు చేశారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరగాల్సిందేనని.. తప్పు చేసిన వారికి ఉరి శిక్ష వేయాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ.. డబ్బు కాంక్షతో ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్టు కాదని అన్నారు.
Tags:    

Similar News