బ్రేకింగ్: బీహార్ సీఎంగా నితీశ్ ఎన్నిక: రేపు ప్రమాణం
బీహార్ పొత్తుల సంసారంలో ఈసారి తక్కువ సీట్లు సాధించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ చిత్తవుతాడని అంతా భావించారు. ఆయన సీఎం కుర్చీ గల్లంతవుతుందన్న అంచనాల నేపథ్యంలో ఎన్డీఏ భేటి ఆసక్తి రేపింది. తక్కువ సీట్లు సాధించినా కూడా పొత్తు ధర్మం పాటించిన బీజేపీ చివరకు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ నే ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామయ్య పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
ప్రభుత్వ ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చర్చించారు. రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తదితర ఎన్డీయే పక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా సుశీల్ మోదీని ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
బీహార్ ఎన్నికల్లో బీజేపీకి 74 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. జేడీయూకి 31 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు బీహార్ ఎన్డీఏ సీఎంగా నితీష్ ను ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో జేడీయూకు సీట్లు తగ్గినా మిత్రధర్మంతో నితీష్ నే సీఎంగా ప్రకటించారు. రేపు నాలుగోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు.