పవన్ కల్యాణ్ జాతి వ్యతిరేకా?

Update: 2017-01-29 05:11 GMT
ఇదే సందేహం కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్ తాజాగా చేసిన వ్యాఖ్యల్నిచూస్తే అనిపించక మానదు. ఈ తెలుగింటి కోడలి మాటల తీరు చూస్తే.. పదవి ఇచ్చిన ప్రధాని మోడీపై ఆమెకున్న స్వామిభక్తి ఎంతన్నది అర్థం కావటమే కాదు.. మోడీని ఆకాశానికి ఎత్తేసే దిశగా ఎలాంటి మాటలు చెప్పొచ్చన్న విషయం కూడా అర్థం చేసుకోవచ్చు.

ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేవారంతా జాతి వ్యతిరేకులే అంటూ కొత్త తరహా వాదనను తెరపైకి తీసుకొచ్చిన ఆమె..జల్లికట్టుకు బీజేపీ ఎంత అనుకూలమన్న విషయాన్ని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. జల్లికట్టు ఉద్యమాన్ని భారీ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నేతలు.. ఆ ఉద్యమం చివర్లో సంఘ వ్యతిరేక శక్తులు ఎంట్రీని తన వాదనకు బేస్ గా చేసుకొని వ్యాఖ్యలు చేయటం గమనార్హం.

‘‘జల్లికట్టు ఉద్యమంలో కొంతమంది ప్రధానికి.. బీజేపీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రధానిగా ఎవరు ఆ పదవిలో ఉన్నా.. వారికి వ్యతిరేకంగా మాట్లాడే వారంతా జాతి వ్యతిరేకులే’’ అంటూ చిత్రమైన వాదనను చేశారు. ఒకవేళ అదే నిజమైతే.. ప్రధానిగా మన్మోహన్ ఉన్నప్పుడు ఆయన్ను.. ఆయన సర్కారుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బేజేపీ నేతల్లో సీతారామన్ ఒకరు. వరుస పెట్టి టీవీ చర్చల్లో యూపీఏ సర్కారుపైనా.. మన్మోహన్ తీరుపైనా విమర్శలు చేసినందుకే ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కిన విషయాన్ని మర్చిపోకూడదు.
Read more!

ఆమె మాటలు వింటే.. దేశాన్ని నడిపించే ప్రధాని.. రాష్ట్రాన్నినడిపించే ముఖ్యమంత్రి మీద ఎవరూ పల్లెత్తు మాట అనకూడదు తెలుసా? అన్నట్లు లేదు..? ఈ లెక్కన ప్రధాని మోడీపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడే జనసేన అధినేత పవన్ కూడా జాతి వ్యతిరేకా? అన్నది సందేహం. స్వామి భక్తి ఉండటం తప్పు కాదు. కానీ.. అది శ్రుతిమించినట్లు ఉంటే.. జనాలకు చిరాకే కాదు.. మరింత మంట పుట్టటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News