నిమ్మగడ్డకు ఊరట.. నగరం దాటివెళ్లేందుకు అనుమతి

Update: 2021-02-10 16:51 GMT
ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు కోర్టులో ఊరట లభించింది. ఆయన నిర్బంధానికి తెరపడింది.  ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ సందర్భంగా ప్రసాద్ కు రూ.5 లక్షల బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈనెల 11 నుంచి ఆగస్టు 2 వరకు హైదరాబాద్ దాటి వెళ్లేందుకు నిమ్మగడ్డకు కోర్టు అనుమతి ఇచ్చింది.అయితే ఆగస్టు 4న విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా ఈ కేసుతో హైదరాబాద్ దాటని నిమ్మగడ్డకు కోర్టు అనుమతితో ఊరట లభించినట్టైంది.

 జగన్ అక్రమాస్తులకేసులైన పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల విచారణ రేపటికి వాయిదా వేసింది. అరబిందో, ఇండియా సిమెంట్స్, లేపాక్షి నాలెడ్జ్ కేసుల విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. దాల్మియా సిమెంట్స్ కేసు ఈనెల 26కి వాయిదా పడింది. ఎమ్మార్ కేసు విచారణ ఈనెల 24కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.
Tags:    

Similar News