అమెరికా ఉద్యోగం కంటే కలెక్టరు పోస్టే గొప్ప

Update: 2015-07-05 12:04 GMT
అమెరికాలో ఉద్యోగమంటే ఎవరూ వదులుకోరు... అలాంటిది ఏకంగా అమెరికాలో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాన్ని వదులుకుని ఓ అమ్మాయి భారత్‌ కు వచ్చేసింది... కలెక్టరు కావాలన్న లక్ష్యం కోసం ఆమె కష్టపడి చదివి అనుకున్న లక్ష్యానికిచేరువైంది.  సివిల్స్‌ లో 146వ ర్యాంకు సాధించింది.

    ఉత్తరప్రదేశ్‌ లోని లక్నోకు చెందిన నీహారికా భట్‌ ఇంజినీరింగ్‌ చదువుకుంది. అనంతరం అమెరికా వెళ్లి మిచిగాన్‌ యూనివర్సిటీలో ఎం.టెక్‌ లో చేరింది.. అక్కడ చదువుతూనే యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో పరిశోధకురాలిగా చేరి అక్కడే ఉద్యోగం పొందింది. అయితే.. దేశానికి సేవచేయాలని... అందుకు కలెక్టరు కావడమే మార్గమని భావించిన ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇండియాకు వచ్చేసింది. 

    ఇండియా వచ్చేసి సివిల్స్‌ కు ప్రిపేరైంది. తొలిప్రయత్నంలోనే 146వ ర్యాంకు సాధించింది. నీహారిక తల్లి గృహిణి కాగా తండ్రి వైద్యుడు. మరో విషమేంటంటే జాతీయ స్థాయిలో 146వ ర్యాకు సాధించినా ఉత్తరప్రదేశ్‌ కు మాత్రం ఆమే టాపర్‌.

Tags:    

Similar News