ఇంత ఫైర్ ఎక్కడిది సామీ : పూనకాలు తెప్పించారుగా...

Update: 2022-10-18 14:45 GMT
పవన్ కళ్యాణ్ సినీ స్టార్ గా వెండి తెర మీద తిరుగులేని  పవర్ ఏమిటి అన్నది సూపర్ గా  చూపిస్తారు. ఇది  జనాలకు తెలుసు. ఆయన రాజకీయాలలో జనసేన అధినేతగా కూడా తెలుసు. ఇప్పటికి పవన్ జనసేనానిగా అనేక సభలూ సమావేశాలలో మాట్లాడారు. ఆయన ఒక్కోసారి  ఆవేశంతో మాట్లాడారు, ఊగిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ పవన్ నాన్ స్టాప్ గా మాటలతో మంటలు పెడుతూ తన ఉగ్ర రూపాన్ని చూపించిన సందర్భం మాత్ర ఒక్కటే. అది మంగళగిరి పార్టీ ఆఫీసులోనే జరిగింది.

నిజానికి పవన్ లో ఆవేశం పాలు ఎక్కువ అని అందరూ అన్నా ఆయన ఒకింత ఆవేశకావేశాలకు లోను అయినా కూడా తనను తాను వెంటనే సంభాళించుకున్న సందర్భాలనే చూశారు. కానీ ఫస్ట్ టైం   పవన్ లోని నిప్పు కణాన్ని బయటకు తీశారు. నేను ఇలాగ కూడా ఉంటాను తేడా వస్తే నిలువెల్లా  నిప్పులే కురిపిస్తాను అన్నట్లుగా మంగళగిరిలో కార్యకర్తలతో పవన్ మాట్లాడుతూ ఫైర్ అయిన తీరు బయట వారికి ఎలా ఉందో తెలియదు కానీ ఫ్యాన్స్ కి జనసైనికులకు మాత్రం పూనకాలే తెప్పించింది అంటున్నారు.

ఇన్నాళ్ళూ ఈ మాదిరి ఫైర్ ఎక్కడ ఉంది సామీ అంటూ క్యాడరే చర్చించుకోవడం కనిపించింది. పవన్ ఏపీలో అత్యంత బలమైన ప్రభుత్వంగా భావిస్తున్న వైసీపీకి రాజధాని నడిబొడ్డునే ఇంకా చెప్పాలంటే సీఎం క్యాంప్ ఆఫీసుకు అతి సమీపంలోనే చేసిన సవాల్ గా ఈ గర్జన అసలైనదిగా క్యాడర్ అంటోంది. పవన్ గత కొన్ని రోజుల పరిణామాలతో విసుగుచెంది ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చింది అని కూడా అంటున్నారు.

నిజానికి పవన్ తనలోని రెండవ కోణాన్నే బయటకు తీసి  చూపించారు అని అంటున్నారు. ఇలాగే ఉంటే తప్ప వర్తమాన రాజకీయాల్లో కంటిన్యూ కావడం కష్టమన్న పరిస్థితులూ ఉన్నాయని అంటున్నారు. ఒక వైపు వైసీపీ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేల పొలిటికల్ ర్యాంగింగ్ కొనసాగుతోందని, ఇపుడు ఏకంగా జనసేననే కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ నేపధ్యంలో కూడా సాఫ్ట్ గా లేదా లైట్ గా తీసుకుని ఉంటే కుదిరే పని కాదనే పవన్ ఇలా విశ్వరూపం చూపించారు అని అంటున్నారు.

మొత్తానికి పవన్ లోని రెండవ కోణాన్ని చూసిన ఫ్యాన్స్ కానీ క్యాండర్ కానీ ఇలాగే ఉండు సామీ జనసేన దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు. పవన్ పరుష పదజాలం కానీ ఆయన హావభావ విన్యాసాలు కానీ క్యాడర్ కి అయితే బాగా నచ్చేసింది. మాట తీరు జోరు మార్చేసిన పవన్ ఒక విధంగా తాను ఇక నుంచి సరి  కొత్త అనిపించారు. మరి ఇదే ట్రెండ్ లో ఆయన కంటిన్యూ అవుతారా. అయితే మాత్రం ఆయన చెప్పినట్లుగా రాజకీయ యుద్ధం ఏపీలో హై ఓల్టేజిలోనే సాగుతుంది అని చెప్పాలి. అటూ ఇటూ పొలిటికల్ హీట్ పెంచితే మాత్రం ఎన్నికల కంటే ముందే ఏపీలో వేసవి వడగాడ్పులు రావడం తధ్యమని అంటున్నారు.

ఇక వైసీపీ నేతలు తనను ప్యాకేజ్ స్టార్ అని పిలిస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలే జారీ చేశారు. అలాగే తన మూడు పెళ్లిళ్లపై వస్తున్న విమర్శల మీద కూడా ఆయన తిరుగులేని జవాబు ఇచ్చారు. ఇక వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలందరికీ పవన్ ఇంకో వైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన సంపాదన, తన ఖర్చులు అన్నీ పార్టీ జనాల సాక్షిగా అందరి ముందు పెట్టి తన నీతి నిజాయతీల గురించి ఆయన గట్టిగానే చెప్పుకుని ప్రత్యర్ధులకు సవాల్ చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News