• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వరల్ట్ అప్ డేట్:...

వరల్ట్ అప్ డేట్: 1.45లక్షల మృతులు..22లక్షల కేసులు

By - Tupaki Desk
Update: 2020-04-17 06:30 GMT
వేసవి కాలం ఎండలు మండుతున్న కరోనా వేడి మాత్రం తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య తాజాగా 1.45 లక్షలు దాటేసింది. దాదాపు 22 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు.అన్ని దేశాల్లోనూ కరోనాను కట్టడి చేయడానికి లక్ డౌన్ ను పొడిగించారు.ప్రపంచంలో గంటకు సగటున 107మంది ప్రాణాలు కోల్పుతున్నట్టు తేలింది.

అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 2569మంది వైరస్ కు బలయ్యారు.  అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 33వేలు దాటింది.  వైరస్ బాధితుల సంఖ్య 6.77 లక్షలకు చేరింది.

యూరప్ లోని ఇటలీ - స్పెయిన్ - ఫ్రాన్స్ - బ్రిటన్‌ లు కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా మరణాల్లో అమెరికా తర్వాత ఇటలీ (22,170) - స్పెయిన్ (19,315) - ఫ్రాన్స్ (17,920) - బ్రిటన్ (13,720) స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు దేశాల్లోనే మొత్తం 1.10 లక్షల మంది కరోనాకు బలయ్యారు. స్పెయిన్‌ లో గురువారం 551 మంది, ఇటలీలో 350 మరణాలు నమోదయ్యాయి.

పాకిస్థాన్‌ లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. దాయాది దేశంలో వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 6,919కి పెరిగింది. ఇప్పటివరకు 128 మరణాలు నమోదయ్యాయి.

*భారత్ లో 13387కు చేరిన కరోనా కేసులు

ఇక భారత దేశంలోనూ కరోనా కేసులు తగ్గడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం వరకు 13387 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 437మంది మరణించారు. 1749మంది కరోనా నుంచి కోలుకున్నారు.

*తెలంగాణలో 650కి కేసులు సంఖ్య

తెలంగాణలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం వరకు కరోనా కేసుల సంఖ్య 650కి చేరింది. తెలంగాణలో  కరోనాతో 18మంది చనిపోయారు. 118 మంది కోలుకొని బయట పడ్డారు.

*ఆంధ్రాలోనూ పెరుగుదలే

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 525 కు చేరింది. 14 మంది ఇప్పటివరకు కరోనా కారణంగా చని పోయారు. 20 మంది కోలుకొని బయటపడ్డారు.
Tags:    
  • Corona Virus In India 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Corona Virus In Andhra Pradesh 
  • Corona Virus 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS