• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నటి హత్య కేసులో...

నటి హత్య కేసులో ట్విస్ట్‌... సినిమా కోసం ఇదంతా

By - Tupaki Desk
Update: 2019-02-11 09:52 GMT
తమిళ నటి సంధ్య హత్య కేసు కేవలం తమిళనాడులోనే కాకుండా సౌత్‌ ఇండియా మొత్తం చర్చనీయాంశం అయ్యింది. సంధ్య మృతదేహం మొత్తం ఏడు భాగాలుగా చేయడంతో ఆమెను గుర్తించడమే పోలీసులకు కష్టం అయ్యింది. చాలా లోతుగా విచారణ జరిపిన పోలీసులకు ఆ శవం సంధ్యదిగా తెలిసింది. పెరుంగుడి చెత్తకుప్పలో దొరికిన కాళ్లు, చేతుల ఆధారంగా ఎంక్వౌరీ మొదలు పెట్టిన పోలీసులు తీగ లాగుతుంటే డొంక కదిలినట్లుగా షాకింగ్‌ విషయాలను వెలికి తీశారు.

సంధ్య భర్త, దర్శకుడు బాలకృష్ణన్‌ ఈ హత్య ఇతివృత్తంగా తీసుకుని థ్రిల్లర్‌ సినిమా తీయాలనుకున్నాడట. ఆమద్య బాలకృష్ణన్‌ స్నేహితుడు చెప్పిన స్క్రీన్‌ ప్లేలో శరీరంను ఏడు భాగాలుగా కత్తిరించి వేయాలని ఉందట. దాంతో బాలకృష్ణన్‌ తన భార్య సంధ్య శవంను ఏడు భాగాలుగా కోసి మరీ చెత్త కుప్పల్లో పడేశాడు. ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న ఈ హత్య ఉదంతంతో ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు బాలకృష్ణన్‌ కొన్ని రోజుల క్రితం 'కాదల్‌ ఇలవశం' అనే పేరుతో సినిమాను తీశాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో తీవ్ర నష్టాల్లో ఉన్నాడు. మరో వైపు సంధ్య పలువురితో అక్రమ సంబంధాలు పెట్టుకుందని అనుమానం ఆయనకు ఉంది. ఆ కారణంగా సంధ్యను హత్య చేసి థ్రిల్లర్‌ సినిమాగా రూపొందించాలని భావించాడు. కాని మొత్తం సీన్‌ రివర్స్‌ అయ్యింది.
Tags:    
  • Sandhya Murder Case 
  • Balakrishnan 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS