• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాక్ ఐఎస్ఐ ఎంట్రీ..ఆఫ్ఘన్...

పాక్ ఐఎస్ఐ ఎంట్రీ..ఆఫ్ఘన్ అధినేత రేసులో కొత్త పేరు

By - Tupaki Desk
Update: 2021-09-07 12:30 GMT
దాదాపుగా 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆఫ్ఘన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుండి వెనక్కి వెళ్ళిపోతునట్టు ప్రకటించగానే ఆఘమేఘాలపై తాలిబన్లు ఆఫ్ఘన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఆఫ్ఘన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొన్ని రోజులుగా ఎడతెగని కసరత్తు చేస్తున్నారు తాలిబన్లు. దేశానికి అధినేతగా ఎవరుండాలి, కీలక పదవులు ఎవరికి ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకోసం పలువురి పేర్లు ఖరారైనట్టు వార్తలు వచ్చినా.. వారి నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

అయితే తాజాగా ఈ అంశంలో తాలిబన్లు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ముల్లా మహమ్మద్ హసన్ అఖుండ్‌ను దేశాధ్యక్షుడిగా, ముల్లా బరాదర్ అఖుండ్, ముల్లా అబ్దుస్ సలాంలను ఉపాధ్యక్షులుగా నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆప్ఘనిస్థాన్‌ ను తమ సొంతం చేసుకున్నప్పటికి నుంచి దేశంలోని పరిణామాలను మీడియాకు వివరించే జబివుల్లా ముజ్జాహిద్దీన్, ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ ప్రతినిధిగా వ్యవహరించనున్నారు.

సిరాజ్ జుడిన్ హక్కానీ ఆఫ్ఘనిస్తాన్ కొత్త అంతర్గత మంత్రిగా ఉంటారని, ఆయనే గవర్నర్లందరినీ నామినేట్ చేస్తారని తాలిబన్ వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత పోటీలో ఉన్న సైన్యాన్ని పునరుద్ధరించడానికి హక్కానీకి సూచనలు చేయడం పాకిస్థాన్ ఐఎస్ ఐ చీఫ్ హమీద్ ఫైజ్ కాబూల్ పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ ఐఎస్ ఐ  హక్కానీ నెట్‌ వర్క్‌ లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ దేశ విదేశాంగ మంత్రి పదవి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాకీకి ఖాయమైనట్టు తెలుస్తోంది.

24 గంటల వ్యవధిలో ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్ల నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తజికిస్తాన్‌కు పారిపోయినట్లు సూచించే నివేదికలతో పాటు పంజ్‌షీర్‌ని తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఈ పరిణామం చోటు చేసుకున్న తరువాత నాయకత్వానికి సంబంధించి తాలిబన్లు తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Tags:    
  • Afghanistan 
  • Taliban 
  • Latest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS