ఏపీలో కొత్త జిల్లాలు రూట్ మ్యాప్ రెడీ అవుతోంది

Update: 2019-11-08 16:04 GMT
తాను అధికారంలోకి వస్తే... నవ్యాంధ్ర ప్రదేశ్ ను 25 జిల్లాలు కలిగిన రాష్ట్రం గా ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు, పాదయాత్ర సందర్బంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన  ప్రకటన గుర్తుంది కదా. ఎన్నికలు ముగిశాయి. జగన్ సీఎం అయ్యారు. అప్పుడే ఐదు నెలల పాలన ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా కొత్త జిల్లాలు రాలేదేమిటా? అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఏపీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కొత్త జిల్లాల పై ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు చేసిన జగన్... తాను చేసిన ప్రకటన మేరకు ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కు అదనంగా మరో 12 జిల్లాలను ఏర్పాటు చేయాలని దాదాపు గా తీర్మానించేశారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని కూడా జగన్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారనే చెప్పాలి.

సరే... సమీక్షలు బాగానే ఉన్నాయి గానీ... కొత్త జిల్లాలు ఎప్పుడు వస్తాయి? కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు ఎన్ని? వాటి పేర్లేమిటి? అన్న విషయం పై ఇప్పటికీ ఆసక్తి కర చర్చే నడుస్తోంది. ఈ చర్చకు సమాధానమన్నట్లుగా ఇప్పుడు కొత్త జిల్లాలపై జగన్ సర్కారు నుంచి ఓ స్పష్టత వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలోని మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలు గా ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు కదా. ఆ మేరకే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలు గా మారుస్తూ మొత్తం జిల్లాల సంఖ్యను 25కు చేర్చేందుకు జగన్ కసరత్తులు చేస్తున్నారట. ఈ విషయంలో ఇప్పటికే అదికార యంత్రాంగానికి  ఓ స్పష్టమైన దిశానిర్దేశం చేసిన జగన్... తనవంతు హోం వర్క్ కూడా చేస్తున్నట్లుగా సదరు వార్తలు చెబుతున్నాయి.

సరే మరి... ప్రస్తుతం ఉన్న జిల్లాల తో పాటు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు ఏవన్న విషయానికి వస్తే... 1. అరకు, 2. శ్రీకాకుళం, 3. విజయనగరం, 4. విశాఖపట్నం, 5. అనకాపల్లి, 6. కాకినాడ, 7. అమలాపురం, 8. రాజమహేంద్రవరం, 9. నరసాపురం, 10. ఏలూరు, 11. విజయవాడ, 12. మచిలీపట్నం, 13. గుంటూరు, 14. నరసరావుపేట, 15. బాపట్ల, 16. ఒంగోలు, 17. నంద్యాల, 18. కర్నూలు, 19. అనంతపురం, 20. హిందూపురం, 21. కడప, 22. నెల్లూరు, 23. తిరుపతి, 24. చిత్తూరు, 25. రాజంపేట కేంద్రాలుగా జిల్లాలు ఏర్పాటు కానున్నాయట. వీటిలో 13 జిల్లాలు ఇప్పటి కే అమలు లో ఉండగా... మరో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయట. కొత్త జిల్లాల సరి హద్దులను తేల్చేసి... ఏపీకి 25 జిల్లాలు కలిగిన రాష్ట్రం గా మార్చేందుకు జగన్ చాలా పకడ్బందీ గానే పావులు కదుపుతున్నారట.
Tags:    

Similar News