మీడియా సరే.. 'మౌత్ పీస్'ల కోసం బాబు వేట!
పార్టీ నిర్వహించిన శిక్షణ శిబిరంలో చివరి వక్తగా(అందరూ అయిపోయిన తర్వాత) సీఎం చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యక ర్తలను ఉద్దేశించి చాలా స్వల్ప సమయం మాట్లాడారు.;
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేళ్లు.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. రాబడుతున్న పెట్టుబడులు.. వాట్సాప్ గవర్నెన్స్.. ఇలా అన్ని విషయాలపై ఒకవైపు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే.. ఇవే కాదని.. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ మౌత్ పీస్(అధికార ప్రతినిధులు)గా మారాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబా బు తెలిపారు. ``పార్టీ కొందరిని మాత్రమే అధికార ప్రతినిధులుగా గుర్తిస్తుంది. కానీ, పార్టీలో ఉన్న అందరూ అప్రకటిత అధికార ప్రతినిధులే`` అని ఆయన చెప్పుకొచ్చారు.
పార్టీ తరఫున ప్రజల్లో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని తేల్చి చెప్పారు. దీనికి ఎవరూ మినహాయింపు కాదన్న ఆయన.. ప్రస్తుతం పార్టీలో 92 శాతం మంది నాయకులు, కార్యకర్తలు కూడా బాగా చదు వుకున్న వారే ఉన్నారని తెలిపారు. వీరంతా పార్టీకి మౌత్ పీస్‌లుగా మారాలని సూచించారు. ఒకవైపు పార్టీ విధానాలను ప్రచారం చేస్తూనే.. మరోవైపు వైసీపీ వ్యతిరేక ప్రచారాన్ని కూడా అంతే బలంగా అడ్డుకోవాలని.. ప్రజల్లోకి ఎప్పటికప్పుడు వాస్తవాలను తీసుకువెళ్లాలని సూచించారు. ``నేను చెప్పలేదని ఎవరూ ఆగొద్దు. పార్టీని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం`` అని తేల్చి చెప్పారు.
పార్టీ నిర్వహించిన శిక్షణ శిబిరంలో చివరి వక్తగా(అందరూ అయిపోయిన తర్వాత) సీఎం చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యక ర్తలను ఉద్దేశించి చాలా స్వల్ప సమయం మాట్లాడారు. వాస్తవానికి ఆయన ఎప్పుడూ సుదీర్ఘ ప్రసంగాలే చేస్తారు. కానీ, ఈ దఫా చాలా స్వల్ప ప్రసంగంతోనే సరిపుచ్చారు. ఆసాంతం ఆహ్లాదంగా ఉల్లాసంగా మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ పాలనపైనా చురకలు అంటించారు. వారి పాలనలో జరిగిన తప్పులను కూడా ప్రస్తుత కూటమి సర్కారుపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వాటిని సరిగా గమనించి అడ్డుకోకపోతే.. ప్రజలు వాటినే నిజమని నమ్మే పరిస్థితి వస్తుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మౌత్ పీస్‌లుగా మారి ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించారు.