85 ఏళ్ల వయసులో పెద్ద పవార్ దంపతులకు ఎంత దుఃఖం?
మహారాష్ట్ర రాజకీయ ఉద్ధండుడు.. మరాఠా యోధుడు.. శరద్ పవార్ గురించి చెప్పే మాట ఇది. జాతీయ రాజకీయాల్లో శరద్ చక్రం తిప్పుతుంటే, మహారాష్ట్రను అజిత్ చూసుకునేవారు.;
కేవలం 38 ఏళ్ల వయసులో మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి.. ఓ దశలో దేశానికి ప్రధానమంత్రి కూడా అవుతారనే అంచనాలుండి.. ఎంతగానో ఇష్టపడే కాంగ్రెస్ వంటి పార్టీని కాదని 60 ఏళ్ల వయసులో సొంత పార్టీ పెట్టుకుని.. నాలుగు దశాబ్దాలుగా అధికారం అనే మంత్రదండాన్ని తన చేతుల్లో పెట్టుకున్న శరద్ పవార్ కు ఇప్పుడు రాజకీయ జీవితంలో అతిపెద్ద కష్టం వచ్చి పడింది. తన రాజకీయ వారసుడు...అన్న కుమారుడు కూడా అయిన అజిత్ పవార్ దుర్మరణం శరద్ పవార్ ను కుంగదీస్తుందని కూడా చెప్పవచ్చు. 85 ఏళ్లు దాటిన పవార్.. కొంతకాలంగా రాజకీయంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. బహుశా ఇంతకుముందు ఎన్నడూ ఆయన ఇంత కింది స్థాయిలో లేరు. 2024 చివర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శరద్ పవార్ ఆధ్వర్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అతి తక్కువ సీట్లకు పరిమితం అయింది. అంతకుముందు 2023లో అజిత్ పవార్ తన బాబాయ్ కు షాక్ ఇచ్చి ఎన్సీపీని చీల్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అప్పటి ఏక్ నాథ్ శిందే (బీజేపీ మద్దతున్న) ప్రభుత్వంలో చేరిపోయారు. వాస్తవానికి ఇదంతా పెద్ద పవార్ ఆడించిన డ్రామాగా ఆరోపణలు వచ్చాయి. అధికారం లేకుండా పవార్ లు ఉండలేరని అందుకే ఇలా చేశారని విమర్శలు చేశారు. అయితే, అజిత్.. పట్టు వీడకుండా కొనసాగారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో దెబ్బతిన్నప్పటికీ అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ ఎన్సీపీ.. బీజేపీ- శిందే శివసేనతో కలిసి బరిలో దిగి ఘన విజయం సాధించింది. అజిత్ మరోసారి ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
రాజకీయ వారసుడు
మహారాష్ట్ర రాజకీయ ఉద్ధండుడు.. మరాఠా యోధుడు.. శరద్ పవార్ గురించి చెప్పే మాట ఇది. జాతీయ రాజకీయాల్లో శరద్ చక్రం తిప్పుతుంటే, మహారాష్ట్రను అజిత్ చూసుకునేవారు. తమ కంచుకోట బారామతిలో పార్టీని అత్యంత పటిష్ఠంగా మార్చారు. అందుకే అజిత్ ను శరద్ రాజకీయ వారసుడిగా చెప్పేవారు. దీనికితోడు శరద్ పవార్ కు కుమారులు లేరు. కుమార్తె సుప్రియా సూలే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా.. విభజనకు ముందు అజిత్ దే ఎన్సీపీలో హవా. వాస్తవానికి బాబాయ్ కు అజిత్ కు అన్నివిధాలా విధేయుడు. కానీ, రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో బయటకు వచ్చారు. ఆ కమ్రంలోనే తాజాగా జరుగుతున్న మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో శరద్-అజిత్ ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు మరికొన్ని రోజుల్లో విలీనం అవుతాయన్న అంచనాలూ ఉన్నాయి. ఈలోగానే అజిత్ దుర్మరణం పాలయ్యారు.
పిన్ని కొడుకుల అపూర్వ బంధం
శరద్ పవార్ భార్య పార్వతీ పవార్. ఈమె భారత మాజీ క్రికెటర్ సదాశివ్ శిందే కుమార్తె. పార్వతికి తన బావగారి కుమారుడు అజిత్ పవార్ అంటే వల్లమాలిన ప్రేమ. అజిత్ కు కూడా పిన్ని అంటే అంతే ఇష్టం. దీనికి ఒక
ఉదాహరణ.. 2019లో అజిత్ ఎన్సీపీని చీల్చి బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం అయ్యారు. కానీ, పిన్ని పార్వతి కల్పించుకుని అజిత్ తో ప్రేమగా మాట్లాడారు. ఆమెపై ఉన్న మమకారంతో అజిత్ వారం రోజులకే తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆయన దుర్మరణంతో 85 ఏళ్ల వయసులో పెద్ద పవార్ దంపతులకు తీరని దుఃఖం అనడంలో సందేహం లేదు.