• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  షర్మిల పాదయాత్రను సక్సెస్...

షర్మిల పాదయాత్రను సక్సెస్ చేసేదెవరు..? పార్టీలపై ప్రభావమెంత..?

By - Tupaki Desk
Update: 2021-10-19 10:30 GMT
నిరుద్యోగ యువతకు న్యాయం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘వైఎస్సార్ తెలంగాణ’ పార్టీలో సందడి తగ్గినట్లయింది.  ప్రారంభంలో హల్ చల్ చేసినా ఆ తరువాత ఎలాంటి హడావుడి చేయకుండా పార్టీ నాయకులు కామ్ గా ఉన్నారు.  హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులతో నామినేషన్ వేస్తామని చెప్పిన షర్మిల ఆ పార్టీ తరుపున ఒక్కరు కూడా నామినేషన్ కేంద్రానికి రాలేదు. అంతకుముందు హుజూరాబాద్లో నిరుద్యోగులు చనిపోతే స్వయంగా వెళ్లి పరామర్శించిన ఆమె ఇక్కడ పోటీ చేయనట్లేనని క్లారిటీ వచ్చింది. అయితే షర్మిల తాజాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. అందుకు ఏర్పాట్లు కూడా రెడీ అవుతుననాయి. ఈ తరుణంలో షర్మిల పార్టీ ప్రభావం ఎంత మేరకు ప్రభావం చూపుతుందోనని ఆసక్తి చర్చ తీవ్రమైంది.

తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు వేడిగానే ఉంటున్నాయి. వరుసగా ఎన్నికలు రావడంతో అధికార పార్టీకి ఇక్కడ సవాల్ గా మారుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి  ఐదేళ్లు ఏ పార్టీ నుంచి పోటీ లేకున్నా ఆ తరువాత ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ ఒకటి రెండు ఎన్నికల్లో విజయం సాధించడంతో మొత్తంగా పట్టుకోసం పోరాడుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సైతం కొత్త పాలకవర్గాన్ని నియమించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇదే సమయంలో వైఎస్ కూతురు షర్మిల నూతన పార్టీని నెలకొల్పారు. వైఎస్ షర్మిల అధ్యక్షతన ‘వైఎస్ఆర్సీపీ తెలంగాణ’ పార్టీని ఏర్పాటు చేసి వైఎస్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. అయితే పార్టీలో పెద్ద తలకాయలు ఎవరూ కనిపించకపోయినా ఒంటరి పోరాటం చేస్తోంది షర్మిల.

హుజూరాబాద్లో ఒకవైపు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో ఎలాంటి హడావుడి చేయని షర్మిల మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి రెడీ అవుతోంది. 400 రోజులు చేపట్టే షర్మిల పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. మొత్తం 4000 కిలోమీటర్లు 90 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు వైసీపీటీ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాట్లకు రెడీ అవుతున్నారు.

షర్మిలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు. ఆమె వైసీపీ తరుపున పాదయాత్ర, బస్సుయాత్రలు చేశారు. మానసికంగా ఇంత పెద్ద బాధ్యతను నెరవేరుస్తారని అంటున్నారు. అయితే ఆమె పాదయాత్ర పూర్తి చేస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్ని పరిస్థితుల్లో షర్మిల ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందోనని చర్చించుకుంటున్నారు. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో షర్మిల పాదయాత్ర ప్రజలపై  ప్రభావం ఉంటుందా..? అన్న చర్చ సాగుతోంది.

షర్మిల పార్టీకి అభిమానులు ఉన్నారు. కానీ రాజకీయంగా పార్టీకి బలం లేదనే తెలుస్తోంది. అయితే కొద్దొ గొప్పో రాజకీయ బలం ఉంటే ఇతర పార్టీలపై ప్రభావం చూపే అవకాశం ఉండేది. కానీ ఏడేళ్లుగా టీఆర్ఎస్ వైపే ఉన్న జనాలను ఇప్పుడిప్పుడే బీజేపీ తనవైపు పలు రకాల మార్గాలతో తన వైపు మలుచుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తోంది. కానీ కేవలం అభిమానులతో మాత్రమే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రయోజనం ఉంటుందా..? అని చర్చించుకుంటున్నారు.

అయితే షర్మిల తెలంగాణ మొత్తంగా పాదయాత్ర చేపట్టినా స్థానికంగా ఉన్న నాయక బలంతో అక్కడి ప్రజలను పాదయాత్రకు తీసుకొచ్చే వీలుంటుంది. కానీ కనీసం కార్యకర్తలు బలంగానే ఆమె పార్టీలో పాదయాత్రను ఏవిధంగా ఆదరిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. కానీ షర్మిల ఒంటరి పోరాట ధైర్యసాహసాలు చూసి తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
Tags:    
  • Sharmila 
  • Sharmila party 
  • Sharmila new party 
  • Sharmila telangana party 
  • Sharmila Padayatra 
  • Sharmila political news 

Similar News

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS