• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నిన్న గవర్నర్...ఇపుడు...

నిన్న గవర్నర్...ఇపుడు మోడీ... ?

By - Tupaki Desk
Update: 2022-02-04 11:46 GMT
ఆయన ప్లాన్స్ ఏంటో ఎవరికీ  తెలియవు కానీ తీరు చూస్తే ఆగ్రహం మాత్రం ఆకాశాన్ని అంటుతోంది అంటున్నారు. అది కూడా బీజేపీ మీద, కేంద్రంలో రాజ్యం చేసేవారి మీద ఒక లెవెల్ లో తన  ఆవేశాన్ని ప్రకటిస్తున్నారు కేసీయార్. ఇక కేంద్రం ద్వారా నియమించబడిన రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై  విషయంలో  కూడా ఆయన ఎందుకో దూరం పాటిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన రిపబ్లిక్ డే వేళ రాజ్ భవన్ కి వెళ్లకుండా కేసీయార్ ప్రగతి భవన్ లోనే జెండా ఎగరేసిన సంగతి విధితమే.

అదే కేసీయార్ తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని టాక్ నడుస్తోంది. శ్రీ రామానుజాచార్యుల సహస్రబ్ది ఉత్సవాలలో పాలు పంచుకునేందుకు హైదరాబాద్ కి ఈ నెల 5న వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు కేసీయార్ వెళ్లకూడదని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు.

ఈ మధ్య కేంద్రంతో వివాదాలు తలెత్తిన నేపధ్యంతో పాటు, కేంద్ర బడ్జెట్ మీద కేసీయార్ నిప్పులు చెరిగి మరీ  తన ఆవేశాన్ని అంతా చూపించిన క్రమంలో మోదీకి స్వాగతం పలకరాదు అని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.  నిజానికి ఈ మధ్య దాకా కేసీయార్ మోడీని ఢిల్లీ వెళ్ళి కలవడం అనేక అంశాల మీద చర్చలు జరపడం చేసేవారు.

అదే విధంగా ప్రధాని హైదరాబాద్ వస్తే ఆయనకు స్వాగతం పలికేవారు. ఇవన్నీ రాజ్యాంగం ప్రకారం పాటించాల్సిన ప్రోటోకాల్. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండరాదు, కానీ ఇపుడు రాజకీయాలు రూటు మార్చుకుంటున్నాయి. దాంతో రాజ్యాంగం ప్రకారం జరిగే సున్నితమైన భేటీలు కూడా వాటిలో పడి నలిగిపోతున్నాయి. అదే విధంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ లో గవర్నర్ కి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య హాట్ హాట్ గానే ఎపుడూ వాతావరణం ఉంటుంది.

అంత వరకూ కధ లేకపోయినా తెలంగాణాలో చూస్తే గవర్నర్ తో టీయారెస్ పెద్దలకు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు అది కాస్తా ముందుకెళ్ళి ప్రధాని తమ సొంత రాష్ట్రానికి వచ్చినా స్వాగతం పలకపోవడం అంటే ఆలోచించాలి. ఇదిలా ఉంటే కేసీయార్ స్థానంలో తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతారని ఈ మేరకు సీఎం కార్యాలయం  వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీంతో ఇపుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. చూడాలి మరి ఇది ఎంతవరకూ వెళ్తుందో. రాజకీయ రచ్చ ఏ రేంజిలోకి సాగుతుందో.
Tags:    
  • Kcr 
  • Kcr government 
  • Kcr comments 
  • Trs party 
  • kcr cabinet meeting 
  • political news 

Similar News

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు

2026-11-19 21:01 GMT

మోదీ ప్రస్తావించిన లైసెన్స్ రాజ్ అంటే ఏమిటి? ఏంటా కథ?

2026-11-19 21:00 GMT

'రాష్ట్ర పండుగ' గా రామోజీరావు జయంతి.. ..ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు ఇవే !

2026-11-19 20:57 GMT

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS