రూ.60కే పెట్రోల్.. మోడీ నయా ప్లాన్
చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకోవడానికి మోడీ రెడీ అయిపోతున్నారు. పెట్రో ధరలు, గ్యాస్ ధరలపై సబ్సిడీలు ఎత్తివేసి వాటి ధరలను ఆయా కంపెనీలకు అప్పజెప్పి పట్టపగ్గాలు లేకుండా పెంచేసి జనాలను బాదేసిన మోడీకి ఇప్పుడు తత్త్వం బోధపడింది. మూడు హిందీ రాష్ట్రాల్లో ఓటమితోగానీ ఆయన కిందకు దిగిరాలేదు. ఇప్పుడు ఎన్నికల వేళ జనాలను మరిపించి మురిపించి మరోసారి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నానికి తెరతీశారు.
ఎన్నికల నాటికి పెట్రో ధరలను భారీగా తగ్గించి సామాన్యుల మనసు దోచుకోవాలని మోడీ మాస్టర్ ప్లాన్ వేశారు. పెట్రోల్ ధరలను ఇటీవలే సుమారు రూ.15వరకు తగ్గించిన మోడీ కొంత నియంత్రణ పాటించారు. 2018 అక్టోబర్ రూ.84కు చేరువై ఆల్ టైం హైయ్యెస్ట్ రేటుకు చేరింది.
అయితే మోడీ పెట్రోల్ ను రూ.60కే సామాన్యులకు అందుబాటులో తేవడానికి ప్లాన్ చేశారు. ఇందుకోసం పెట్రోల్ లో మిథనాల్ మిశ్రమాన్ని 10 నుంచి 15శాతానికి కలిపి ధరలను నియంత్రించాలని యోచిస్తున్నారు. దీనివల్ల ధరలు తగ్గుతాయి. దీనిపై ఉన్నతస్థాయి సమావేశానికి మోడీ రంగం సిద్ధం చేస్తున్నారు.
అయితే మిథనాల్ ఎక్కువగా కలిపిన నయా పెట్రోల్ అమ్మడానికి పెట్రోల్ బంకులన్నింటిని ఆధునీకరించాల్సి ఉంటుంది. ఈ భారాన్ని చమురు సంస్థలే మోయాల్సి ఉంటుంది. బంకు యజమానులందరూ దీనికి ఒప్పుకుంటారా.. ఆధునీకరిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే నీతి అయోగ్ మాత్రం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ధీమాగా చెబుతోంది. ఒక్కో పెట్రోల్ బంక్ కు మిథనాల్ పెట్రోల్ ఆధునీకరణ చేసేందుకు రూ.5 లక్షలు ఖర్చవుతుందట.. ఈ నిధులను చమురు కంపెనీలే భరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే మిథనాల్ మిశ్రమ పెట్రోల్ రూ.60కే అందుబాటులోకి వస్తుంది. ఎన్నికల వేళ దీన్ని చూపించి ఓట్లు రాబట్టుకునేందుకు మోడీకి అవకాశం చిక్కుతుంది. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి..
Full View