లోకేష్.... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే...

Update: 2019-02-16 14:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్సీలందరూ కూడా తమ పదవులకు రాజీనామ చేసి శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా పోటీకి సిద్దం అవుతున్నారు. సోమీరెడ్డి చంద్రమోహన రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేసి రాబోయే ఎన్నికలలో శాసనసభ్యుడిగా పోటీ చేసేందుకు సిద్ద పడుతున్నారు. తాను సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం. ఇక నారయణ కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఇంత మంది గురించి చెబుతున్నారు కదా మరి  చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నారా లోకేష్‌ గురించి ప్రస్తావించారేమిటా  అని అనుకుంటున్నారా... అక్కడకే వస్తున్నా.... నారా లోకేష్‌ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది ఆయన వైఖరి. రాబోయే రోజులలో ఆయన ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారో... ఎప్పటి నుంచి తన ప్రచారం మొదలు పెడతారో ఎవరికీ అర్దం కావటం లేదు.

దొడ్డిదారిన మంత్రి కావడమే అద్రుష‌్టంగాను, ఎంతో ఘనత సాధించినట్లు చెప్పుకునే నారా లోకేష్‌ రాబోయే రోజులలో తన పొలిటికల్‌ కేరీర్‌ గురించి ఎక్కడ మాట్లాడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు అంతా కూడా యువత చేతిలోనే ఉంది అంటూ పదేపదే చెప్పే చంద్రబాబు నాయుడు తన కుమారుడి భవిష్యత్తుపై ఈ మధ్యకాలంలో ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం గమనార్హం. సోమిరెడ్డి - నారయణ లాంటి సీనియర్లు సేతం రెట్టింపు ఉత్సాహంతో ఎన్నికల సమరానికి సై అంటుంటే లోకేష్‌ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి కనీసం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేయకపోవడం ఏమిటని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.

రాబోయే ఎన్నికలలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఎలాగు మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకోనక్కర్లేదు..... లేదా తెలుగుదేశం పార్టీ గెలిస్తే దొడ్డిదారిలో మంత్రి అవ్వడం ఎలాగు ఖయమే కదా.. ఈ మాత్రం దానికి జుత్తు పీక్కోవడం అవసరమా అని లోకేష్‌ అభిప్రాయం కావచ్చంటూ తెలుగుదేశం పార్టీలో ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైతే నేం నారా లోకేష్ పనితీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.

Tags:    

Similar News