ఏమైంది?; అపోలో ఆసుపత్రిలో బ్రహ్మణి

Update: 2016-03-16 04:27 GMT
బ్రహ్మణి ఆసుపత్రిలో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోడలు.. ప్రముఖ టాలీవుడ్ హీరో బాలకృష్ణ కుమార్తె.. లోకేశ్ సతీమణి అయిన బ్రహ్మణి తాజాగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్రహ్మణికి ఏమైంది? ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? అన్న ప్రశ్నల్లోకి వెళితే.. ప్రమాదవశాత్తు ఆమె పడటం.. ఆమె చేతికి గాయం కావటంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

బ్రహ్మణి ప్రమాదానికి గురయ్యారన్న విషయం తెలిసిన వెంటనే.. ఏపీ సీఎం చంద్రబాబు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి.. కోడలి ఆరోగ్యం గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మణిని ఆమె తండ్రి బాలకృష్ణ పరామర్శించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని.. త్వరలోనే డిశ్చార్జ్ అయిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
Tags:    

Similar News