మిక్సోపతి వైద్యం ... మిక్సోపతికి వ్యతిరేకంగా 1 నుండి వైద్యలు రిలే నిరాహార దీక్షలు
దేశంలో మిక్సోపతి వైద్య విధానం అమలుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆధునిక వైద్య వృత్తిని పునరుద్ధరించడానికి మిక్సోపతికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళనకి దిగబోతుంది. ఇందులో భాగంగా వచ్చే నెల 1 నుండి ఫిబ్రవరి 14 వరకు రిలే నిరాహార దీక్ష ప్రారంభించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఎంఏ సభ్యులను, వైద్యులను కోరింది. దేశ వ్యాప్తంగా 50 ప్రాంతాల్లో భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ఐఎంఏ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆయుర్వేదం, సిద్ధ, హోమియోపతి డాక్టర్లు కూడా 56 రకాల శస్త్ర చికిత్సలు చేయవచ్చని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అల్లోపతి, ఆయుర్వేదం, సిద్ధ, హోమియోపతి వైద్యాల ను సమన్వయపరుస్తూ మిక్సోపతి వైద్య విధానంలో చికిత్స అందించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ విధానం వైద్యరంగానికి పెనుప్రమాదం తెచ్చి పెడుతుం దని వైద్య సంఘాలు ఆరోపణలు చేస్తుంది. కేంద్రం నిర్ణయా న్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు భారత వైద్య సంఘం వెల్లడించింది.