హైదరాబాద్ టు ఏపీ.. హైవేపై ప్రవాహంలా ఎన్ని వాహనాలో తెలుసా..!

సంక్రాంతి పండగ సందడి ఏ స్థాయిలో ఉండబోతోందో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి చెప్పకనే చెబుతోంది.;

Update: 2026-01-12 05:22 GMT

సంక్రాంతి పండగ సందడి ఏ స్థాయిలో ఉండబోతోందో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి చెప్పకనే చెబుతోంది. హైదరాబాద్ నగరవాసులు అంతా సొంతూళ్ల బాట పడుతున్నారు. దీంతో.. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల ప్రవాహం పీక్స్ కి చేరింది. ఈ క్రమంలో.. శుక్రవారం సాయంత్రం నుంచి గంట గంటకూ వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రవాహంలా కదులుతున్నాయి.

అవును... ప్రవాహంలా వస్తున్న వాహనాలతో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారి కళకళలాడింది. ఈ క్రమంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా కనిపించింది. ఇందులో భాగంగా.. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు సుమారు 21,000 వాహనాలు ప్రయాణించగా.. శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ సంఖ్య 22,000 కు చేరుకున్న పరిస్థితి.

ఈ నేపథ్యంలో లక్షకు పైగా వాహనాలు హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ప్రవాహంలా కదిలాయని చెబుతున్నారు. ఈ స్థాయిలో తాకిడిని తట్టుకునేందుకు అదనపు టోల్ బూత్ లను అందుబాటులోకి తెచ్చి, ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ రద్దీ.. ఈ ఏడాది సంక్రాంతి ఏ స్థాయిలో ఉండబోతుందో చెప్పకనే చెబుతుందని అంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో టోల్ బూత్ కార్మికులు క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారని అంటున్నారు. సాధారణంగా విజయవాడ వైపుగా రోజుకు సరాసరిన 10 నుంచి 12వేల వాహనాలు నిత్యం తిరుగుతుంటాయని చెబుతారు. అయితే.. ఈ సంక్రాంతి పండగ నేపథ్యంలో మరో 34 వేల వాహనాలు అదనంగా వచ్చాయని అంటున్నారు. దీంతో.. నందిగామ వై-జంక్షన్‌ వద్ద సర్వీస్‌ రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు.

Tags:    

Similar News