• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎన్నారై జయరాంను ఎందుకు...

ఎన్నారై జయరాంను ఎందుకు చంపారు? ఎలా చంపారో తెలుసా?

By - Tupaki Desk
Update: 2019-02-05 13:19 GMT
ఎన్నారై బిజినెస్‌ మేన్ చిగురుపాటి జయరాం హత్యకేసు విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్మా, మీడియా, బ్యాంకింగ్ వ్యాపారాలు చేసి నష్టపోయి అప్పులు చేసిన జయరాంను  ఎవరు హత్య చేశారు.. ఎలా చంపారన్నది పోలీసులు వెల్లడించారు. అక్రమ సంబంధాలు, ఆర్థిక సంబంధాల నేపథ్యంలో జరిగిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠీ మీడియాకు వెల్లడించారు.
   
ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి, డ్రైవర్ శ్రీనివాస్‌ లను అరెస్టు చేసినట్లు చెప్పారు. జయరాంకు హైదరాబాద్‌ లోని కుత్బుల్లాపూర్‌ లో ఫార్మా కంపెనీ ఉంది. కానీ, అది 2015లో సమస్యల్లో చిక్కుని లాకౌట్ అయింది. దీంతో షాపూర్‌ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి, సెటిల్మెంట్లు చేసే రాకేశ్ రెడ్డిని సంప్రదించాడు జయరాం. సమస్య సెటిల్ చేయమని కోరాడు. అందుకోసం సంస్థలో డైరెక్టరుగా ఉన్న తన మేనకోడలిని సంప్రదించాలని సూచించాడు. దాంతో శిఖా, రాకేశ్ మధ్య పరిచయం పెరిగింది.  జయరాం కూడా రాకేశ్ వద్ద వద్ద 4.5 కోట్ల రూపాయలకు పైగా అప్పుగా తీసుకున్నారు. పూచీకత్తుగా ఇంటిని రాసిచ్చారు. కానీ, ఆ ఇంటిపై అప్పటికే లోన్ ఉందని ఆ తరువాత రాకేశ్‌ కు తెలిసింది. దాంతో రాకేశ్ తన డబ్బు తిరిగిమ్మని జయరాంను అడగడం మొదలుపెట్టాడు. వడ్డీతో సహా 6 కోట్లు కావాలని అడిగినా జయరాం ఇవ్వలేకపోయాడు.
   
ఆ తరువాత రాకేశ్ జయరాంను తన డబ్బు కోసం ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోయింది. చివరకు జయరాం రాకేశ్ ఫోన్ చేసినప్పడు ఎత్తడం కూడా మానేయడంతో జయరాం రాక కోసం రాకేశ్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. శిఖాతో మంచి సంబంధాలు ఉండడంతో ఆమె సహాయంతో జయరాం జనవరి నెల 29న వస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఓ మహిళ పేరుతో సిమ్ కార్డు తీసుకుని ఆ నంబరుతో జయరాంతో చాట్ చేసి ఉచ్చులోకి లాగి రాకేశ్ ఇంటికి రప్పించారు. అలా వచ్చిన జయరాంను అక్కడే బందించి తన డబ్బు కోసం ఒత్తిడి చేశాడు రాకేశ్. దగ్గరుంది జయరాంతో ఆయన స్నేహితులకు ఫోన్ చేయించి డబ్బులు అడిగించాడు. అలా చేసినా కేవలం రూ.6 లక్షలే రావడంతో ఆగ్రహించిన రాకేశ్ జయరాంను కొట్టాడు. కిందపడిపోయిన జయరాంను సోఫాకు అదిమి చంపేశాడు. తర్వాత ఈ హత్యను ప్రమాదకరంగా చిత్రీకరించాలని ఆ మృతదేహాన్ని కారులో తీసుకుని విజయవాడ హైవే పై వదిలేసి వెళ్లిపోయారని పోలీసులు చెప్పారు.
   
ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జయరాం చాలాకాలంగా అమెరికాలో ఉండేవారు. హైదరాబాద్‌ లో ఎక్స్ ప్రెస్ టీవీ అనే చానల్ పెట్టి నష్టాలు రావడంతో మూసేశారు. కోస్టల్ బ్యాంక్ అనే బ్యాంక్ పెట్టారు. హెమారస్‌ ఫార్మా కంపెనీ ఆయనదే. ఇంకా కళ్లద్దాల తయారీ కంపెనీ కూడా ఉంది. జయరాం భార్య, పిల్లలు ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నారు.

జయరాంకు ఆయన మేనకోడలు శిఖాతో సంబంధాలున్నాయన్న ప్రచారం ఉంది. శిఖా ప్రియుడు రాకేశ్ రెడ్డి. ఈ సంబంధాలు జయరాం హత్యలో కీలక పాత్ర పోషించాయి.


Tags:    
  • Chigurupati Jayaram Murder 
  • Latest Updates 
  • Rakesh Reddy 
  • Telugu News 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS