• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీటీడీపీ ఇక ఖాళీనే .....

టీటీడీపీ ఇక ఖాళీనే .. బీజేపీలోకి మోత్కుపల్లి

By - Tupaki Desk
Update: 2019-11-05 05:10 GMT
ఓడలు బండ్లు కావడం ..బండ్లు ఓడలు కావడం కేవలం రాజకీయాలలో మాత్రమే సాధ్యం అవుతుంది. అప్పటివరకు ఆ పార్టీ అధినేత పై అదారుణమైన విమర్శలు చేసినవారే ఆ తరువాత కొన్ని రోజులకి అదే అధినేతకు జై కొట్టి పార్టీలో చేరిపోతారు. అదేమిటి అంటే మా నియోజవర్గం అభివృద్ధి కోసం , అయన పాలన బాగుంది కాబట్టి చేరుతున్నాం అంటారు. మళ్ళీ ఎన్నికల సమయానికి అదే పార్టీలో ఉంటారో ఉండరో కూడా తెలియదు. అందుకే రోజు రోజుకి ప్రజాప్రతినిధులపై ప్రజలకి నమ్మకం తగ్గిపోతుంది. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా కొంతమందికి తెలియడంలేదు. స్కూల్ పిల్లలైనా ఒకే స్కూల్ లో చదువుతారేమో కానీ , రాజకీయ నేతలు మాత్రం ఒకే పార్టీ లో చివరి ఉండటం ప్రస్తుత రోజుల్లో అసాధ్యం. ఆలా ఉండాలని ప్రజలు కోరుకోవడం కూడా అత్యాశే అవుతుంది.

ఇకపోతే తెలంగాణలో వలసల రాజకీయ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణ లో తెరాస కి గట్టి పోటీనిస్తున్న పార్టీ అంటే బీజేపీ అని చెప్పాలి. కాంగ్రెస్ లో ఉన్న కీలక నేతలు వారి పదవుల కోసం పోట్లాడటానికే సమయం సరిపోలేదు. దీనితో త్వరలో కాంగ్రెస్ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా పెద్దగా ఆశ్చర్యం లేదు. ఇక మూసేయడానికి సిద్ధంగా ఉన్న మరో పార్టీ టీడీపీ ... రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ లో టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. అసలు మొన్న జరిగిన హుజూర్ నగర్ బై పోల్ లో ఇండిపెండెంట్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అంటే టీడీపీ ఎటువంటి పరిస్థితిలో ఉందొ చెప్పవచ్చు. దీనితో టీటీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బీజేపీలోకి చేరిపోతున్నారు.

ఇదే క్రమంలో తాజాగా టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి బీజేపీలో చేరబోతున్నారు. టీడీపీలో కీలక నేతగా ఎదిగిన మోత్కుపల్లి చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరతారంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు. తాజాగా అయన బీజేపీలోకి చేరిపోయారు. బీజేపీలో చేరే విషయమై ముందుగా అమిత్‌ షాతో మాట్లాడాలన్న యోచన మేరకు రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో ఆయనతో సమావేశమై పలు అంశాలపై  చర్చలు జరిపారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి అధికారికంగా ఆ పార్టీలో చేరనున్నారు.
Tags:    
  • Motkupaalli 
  • Telugu Desam 
  • Tdp 
  • Tupaki Updates 
  • Tupaki News 

Similar News

పాలు తాగవు...పగబట్టవు !

2026-11-13 00:30 GMT

అమెరికా ఆహారపు అలవాట్లలో మార్పులు.. కొత్త ఫుడ్ పిరమిడ్‌లో ఏయే ఆహారాలకు చోటు?

2026-11-12 23:30 GMT

కాకినాడ మేయర్....వైసీపీ అనూహ్యమైన ఎంపిక !

2026-11-12 22:30 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

2026-11-12 18:33 GMT

పెట్టుబడుల భద్రతా చట్టం.. కేంద్రానికి చంద్రబాబు సంచలన ప్రతిపాదన

2026-11-12 18:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

నారా లోకేష్‌ 'రాక్‌స్టార్ మినిస్టర్' .. ఉపాసన కొణిదెల ప్రశంసల వెనుక సందేశం అదే..

2026-11-12 18:27 GMT

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

2026-11-12 18:25 GMT

జగన్ లేకపోతే ఏమీ కారు.... సాయిరెడ్డికి వైసీపీ షాక్ !

2026-11-12 18:20 GMT

జెన్సన్ హువాంగ్ చుట్టూ వివాదం.. Nvidiaలో ఏం జరగబోతోంది?

2026-11-12 18:19 GMT

Copyright @2026

Powered by Blink CMS