• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Alluri Sitharama Raju >  వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్...

వైసీపీ ఏకైక జడ్పీ ఛైర్ పర్సన్ గా వంతల శాంతి

| అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా వంతల శాంతిని వైసీపీ అధినేత జగన్ ఎంపిక చేశారు. పెదబయలు జెడ్పీటీసీగా గెలిచిన ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. వైస్ చైర్‌పర్సన్‌గా పాడేరు జెడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబును ప్రకటించారు. జిల్లాలో 11 జెడ్పీటీసీ స్థానాలకు ఏడు గెలుచుకుని వైసీపీ జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంది.

By - Satya P
Update: 2026-11-12 18:33 GMT

వైసీపీ తాజాగా జరిగిన పరిషత్తు ఎన్నికల్లో ఒకే ఒక జెడ్పీ పీఠాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. మొత్తం రాష్ట్రంలో 28 జెడ్పీ పీఠాలు ఉంటే అందులో 27 కూటమి పరం అయ్యాయి. ఉత్తరాంధ్రాలో ఒకే ఒక జిల్లా అల్లూరి సీతారామరాజు వైసీపీకి అండగా నిలిచి భారీ ఊరటను ఇచ్చింది. దాంతో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున జెడ్పీ చైర్ పర్సన్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అన్న ఉత్కంఠ అయితే అటు వైసీపీలో ఇటు కూటమిలో కూడా ఉంది.

వైసీపీ డెసిషన్ :

ఈ నేపధ్యంలో వంతల శాంతి పేరుని కొత్త చైర్ పర్సన్ గా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ మేరకు తాడేపల్లికి వచ్చిన అల్లూరి జిల్లా పార్టీ నాయకుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే వంతల శాంతి అల్లూరి జిల్లాలోని పెదబయలు మండలం నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్‌గా పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు పేరును ప్రకటించారు. అల్లూరి జిల్లాలోని 11 జడ్పీటీసీ స్థానాలకు గానూ ఏడు స్థానాలను గెలుచుకోవడం ద్వారా వైసీపీ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది. అన్ని సామాజికవర్గాలకు సమన్యాయం చేసే ఉద్దేశంతో ఈ ఎంపికలు జరిగినట్లు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వెల్లడించారు.

సామాజికపరంగా :

ఇదిలా ఉంటే కొత్త జెడ్పీ చైర్ పర్సన్ వంతల శాంతి సామాజిక వర్గం. ఆమె గిరిజన ఎస్టీ - కోదు సామాజిక వర్గానికి చెందిన వారుగా చెబుతున్నారు. సామాజిక వర్గం పరంగా చూస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయ, పాడేరు, ముంచంగిపుట్టు మండలాలులలో వీరి జనాభా ఎక్కువగా ఉంటుంది. దాంతో కీలకమైన చైర్ పర్సన్ పదవిని వీరికి ఇస్తూ వైసీపీ సమ న్యాయం పాటించింది అని అంటున్నారు. అదే విధంగా పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు సామాజిక వర్గం కూడా కీలకమైనదే. ఆయన కొండదొర సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గతంలో ఆయన రెండు మార్లు సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. చైర్ పర్సన్ అరకు నుంచి మహిళ అయితే వైఎస్ చైర్మన్ పాడేరు నుంచి పురుష కోటాలో ఎంపిక చేశారు. ఇలా రెండు నియోజకవర్గాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు అయింది అని అంటున్నారు.

పార్టీ పెద్దలు రాక :

తొందరలో జెడ్పీ చైర్ పర్సన్, వైఎస్ చైర్మన్ ల ఎంపిక జరగనుంది. అనంతరం జరిగే ప్రమాణం స్వీకార కార్యక్రమానికి పార్టీ పెద్దలు వస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే అల్లూరి జిల్లా వైసీపీకి అన్ని విధాలుగా అండగా ఉంటోంది. దాంతో వైసీపీ హైకమాండ్ కూడా ఇక మీదట ఫుల్ ఫోకస్ పెడుతుందని అంటున్నారు.

Tags:    
  • vanthalashanthi 
  • allurizp 
  • ysrcp 
  • ysjagan 

Similar News

'మ‌న్యం'లో జ‌న‌సేనకు మైన‌స్‌లు ఇవే.. !

2026-11-12 13:30 GMT

టీడీపీలో 'రోజులు' మారాయ్‌.. !

2026-11-11 22:30 GMT

27 జిల్లాలు ఒక ఎత్తు.. అల్లూరి జిల్లా ఇంకొక ఎత్తు! ఓటమిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

2026-11-09 19:10 GMT

గిరి'జ‌నం'లో జ‌న‌సేన‌కు ప‌ట్టెంత‌.. ?

2026-11-08 17:30 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

అల్లూరి జిల్లాలో వైసీపీ వర్సెస్ జనసేన !

2026-10-28 03:37 GMT

ఎక్కువ సీట్లలో జనసేన ...నాగబాబు సంచలన వ్యాఖ్యలు !

2026-10-19 17:30 GMT

అరకుకు చిన్న శ్రీను...కుమార్తెకు టికెట్ ?

2026-10-10 03:32 GMT

మరో ఎస్టీ సీటు మీద జనసేన కర్చీఫ్ !

2026-09-12 03:26 GMT

మాటిచ్చారు.. నిల‌బెట్టారు.. ప‌వ‌న్‌పై గిరిపుత్రుల హ‌ర్షం

2026-05-13 09:45 GMT

కొండలపై మరణ మృదంగం.. ప్రభుత్వం ఏం చేయాలి?

2025-12-12 04:13 GMT

Copyright @2026

Powered by Blink CMS