• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పొగరుబోతు నార్వే...

పొగరుబోతు నార్వే జర్నలిస్టుకు తగిన శాస్తి చేసిన మోడీ సర్కార్

| హైదరాబాద్‌లో జరగనున్న భారత్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు నార్వే జర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సన్‌కు జారీ చేసిన వీసాను కేంద్రం చివరి నిమిషంలో రద్దు చేసింది. గతంలో నార్వేలో ప్రధాని మోదీని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రశ్నించిన ఆమె వీసా రద్దు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

By - A.N.Kumar
Update: 2026-11-12 18:25 GMT

యూరోపియన్లు తామే ప్రపంచంలో గొప్ప వారమని విర్రవీగుతుంటారు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటిని ఆక్రమించి దోచుకొని తిన్న డబ్బులు ఇంకా వారి వద్ద పదిలంగా ఆస్తుల రూపంలో ఉండడంతో మిగతా దేశాలంటే చిన్న చూపు. భారత నేతలు అన్నా.. ప్రధానులు, విదేశాంగ మంత్రులు వచ్చినా చాలా అతి చేస్తుంటారు. ఇటీవల నార్వేలో పర్యటించిన మోడీ, జైశంకర్ లను అవమానించేలా మాట్లాడింది అక్కడి ఓ లేడి జర్నలిస్టు. భారత్ లో హక్కులు కాలరాస్తున్నారంటూ నానా హంగామా సృష్టించింది. ఆమె గుర్తిందిగా.. ఇప్పుడు భారత్ పర్యటనకు ఆమెకు వీసా ఇచ్చి మరీ రద్దు చేసి మోడీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చేసింది. మన దేశానికి వచ్చి మనపైనే నిందలు వేసే ఇలాంటి అహంకార పూరిత జర్నలిస్టులను దేశంలోనే పాల్గొనకుండా మోడీ సర్కార్ మంచి పనిచేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'భారత్ సమ్మిట్'లో పాల్గొనేందుకు నార్వేకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్‌కు మంజూరైన వీసా చివరి నిమిషంలో రద్దు కావడం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ దౌత్య నిబంధనలు, వీసా విధానాల ప్రకారం.. ఏ దేశానికైనా తన భూభాగంలోకి విదేశీ పౌరుల ప్రవేశాన్ని నియంత్రించే పూర్తి సార్వభౌమాధికారం ఉంటుంది. వీసా జారీ అయినంత మాత్రాన దేశంలోకి ప్రవేశానికి సంపూర్ణ హామీ లభించినట్లు కాదు. దేశ అంతర్గత భద్రత, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎప్పుడైనా వీసాలను సమీక్షించి రద్దు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. గతంలో భారత్‌కు సంబంధించిన అంశాలపై ర్నలిస్ట్ హెలె లింగ్ స్వెండ్సెన్‌ విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో భద్రతా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరించడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమని కేంద్రంలోని హోంశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ వివాదానికి అసలు కారణం ఈ లేడి జర్నలిస్టు దుందుడుకు వైఖరే.. నార్వేలో ప్రధాని మోడీ పర్యటించిన సమయంలో ఈ అమ్మగారు హెలె లింగ్ వార్తల్లో నిలిచారు. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత్ లో హక్కులు కాలరాస్తున్నారంటూ ఆమె నేరుగా మోడీని ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ప్రధాని సమాధానం ఇవ్వకుండానే మీడియా సమావేశం నుంచి వెళ్లిపోవడం.. ఈమె అరుస్తూ ప్రశ్నించడం అప్పట్లో వైరల్ గా మారింది.

ఇప్పుడు అదే జర్నలిస్టు హైదరాబాద్ లో నిర్వహించే సమావేశానికి హాజరుకానున్న వేళ వీసా ఇచ్చి మరీ రద్దు చేసి కేంద్రం తగిన శాస్తి చేసిందని పలువురు అంటున్నారు. నోరు ఉంది కదా అని.. విదేశాల్లో మన దేశాన్ని, ప్రధానిని తక్కువ చేసి మాట్లాడే ఇలాంటి జర్నలిస్టులకు మన దేశంలో అడుగుపెట్టే అవకాశం కూడా ఇవ్వకపోవడం మంచిదని.. కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందన్న చర్చ మేధావి వర్గాల్లో వ్యక్తమవుతోంది.


I got a visa to India and was supposed to leave this morning to attend the Bharat Summit in Hyderabad. I had been invited as a panelist and speaker on the future of media and press freedom. But «orders from above» in the Ministry of Home Affairs have cancelled my visa. Here is my message for @AmitShah

— Helle Lyng (@HelleLyngSvends) November 11, 2026


Tags:    
  • hellelyng 
  • norwegianjournalist 
  • indiavisa 
  • bharatsummit 
  • pressfreedom 

Similar News

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

Nvidia CEO రేసులో భారతీయుల పేర్లు.. అసలు పరిస్థితి ఏంటి?

2026-11-13 16:49 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్

2026-11-13 16:34 GMT

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల విషయంలో కీలక పరిణామం!

2026-11-13 16:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

టిప్ ఇస్తేనే క్యాబ్.. లేదంటే జాబ్.. ఓలా తెలివితేటలకు కేంద్రం రూ. 10 లక్షల యాడ్-ఆన్ షాక్

2026-11-13 13:30 GMT

శ్రీకాకుళంలో 'గుండ విగ్ర‌హ' రాజ‌కీయం!

2026-11-13 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS