• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  ఒకటి కాదు.. రెండు కాదు.....

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

| వ్యక్తిగత సంబంధాలపై వరుస ఆరోపణల నేపథ్యంలో ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. సీఎఫ్ఓ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామాలతో వారంలో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 500 బిలియన్ డాలర్లు తగ్గింది. గురువారం షేర్లు ఇంట్రాడేలో 14 శాతానికి పైగా పడిపోయాయి.

By - A.N.Kumar
Update: 2026-11-13 13:47 GMT

ఏ ముహూర్తాన ఎన్వీడియా మాజీ సీఈవో జెన్సన్ హువాంగ్ ఎఫైర్ బయటపడిందో.. అప్పటి నుంచి బ్యాడ్ టైం స్ట్రాట్ అయిపోయింది. టైమింగ్ అస్సలు బాగోలేదబ్బా.. ఒకటి అనుకుంటే.. మూడు ఎఫైర్లు బయటకొచ్చాయి. వచ్చాక జరిగిన రచ్చ మరింత కాకరేపింది. ఈయన ఎఫైర్ల దెబ్బకు సీఈవో పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతటితో అంతా క్లోజ్ అయ్యిందా? అంటే అదీ లేదు.. ఏకంగా ఎన్వీడియా సంపద రూ.47 లక్షల కోట్లు ఆవిరి అయిపోయి సంస్థ మటాష్ అయిపోయింది.

ప్రపంచాన్నే తన ఏఐ చిప్‌లతో శాసిస్తున్న టెక్ దిగ్గజం ఎన్విడియా. ఇప్పుడు ఏకంగా తన సొంత సీఈఓ వ్యక్తిగత మేధస్సు దెబ్బకు విలవిలలాడిపోతోంది. ప్రపంచంలో ఏ సమస్యకైనా మా దగ్గర చిప్ ఉంది అని నిన్నటి దాకా కాలర్ ఎగరేసిన ఎన్విడియా.. ఇప్పుడు "మా బాస్ ఎఫైర్ వివాదాన్ని కంట్రోల్ చేసే చిప్ మాత్రం తయారు చేయలేకపోయాం అని తలపట్టుకునే పరిస్థితి వచ్చింది.

దశాబ్దాలుగా నల్లటి తోలు జాకెట్ వేసుకుని టెక్ ప్రపంచానికి స్టైల్ ఐకాన్‌గా మారిన జెన్సన్ హువాంగ్.. ఇప్పుడు అదే జాకెట్‌తో తన పరువును దాచుకోలేక సీఈఓ పదవికే గుడ్‌బై చెప్పేశారు. ఏఐ విప్లవాన్ని నడిపిస్తున్న ఈయన జీవితంలోకి ఒక ఎఫైర్ వివాదం ప్రవేశించడమే కాకుండా అందులో చైనా నిఘా సంస్థల హస్తం ఉందనే అనుమానాలు కూడా తోడయ్యాయి. అమెరికా భద్రతా సంస్థల కళ్లు ఎర్రబడటం.. కంపెనీ సీక్రెట్లు లీక్ అయ్యాయనే గుసగుసలు వినిపించడంతో ఎన్విడియా బోర్డుకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఇక సెలవు అంటూ జెన్సన్ హువాంగ్ రాజీనామా లేఖ పడేయగా సీఎఫ్ఓ కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.

సాధారణంగా ఎవరికైనా ఎఫైర్ బయటపడితే ఇంట్లో గొడవలు అవుతాయి. కానీ జెన్సన్ హువాంగ్ విషయంలో మాత్రం ఏకంగా అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. గత వారం 4.50 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఎన్విడియా మార్కెట్ విలువ గురువారం నాటికి 4.01 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే కేవలం వారం రోజుల్లోనే దాదాపు 500 బిలియన్ డాలర్లు.. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే అక్షరాలా రూ.47 లక్షల కోట్ల సంపద మంచులా కరిగిపోయింది. గురువారం మార్కెట్ మొదలవ్వగానే షేర్లు 14 శాతం మేర కుప్పకూలడం చూసి ఇన్వెస్టర్లకు గుండె ఆగినంత పనైంది.

కంపెనీ మునిగిపోతుంటే బాస్ మాత్రం సేఫ్‌గా ఉంటారా? ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో జెన్సన్ హువాంగ్ సంపద 144.7 బిలియన్ డాలర్లకు అంటే దాదాపు సుమారు రూ.13.63 లక్షల కోట్లు పడిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ టెన్‌లో వెలిగిపోయిన ఆయన ఒక్కసారిగా 13వ స్థానానికి జారిపోయారు.

1993లో తాను ఎంతో ప్రేమతో కట్టుకున్న సామ్రాజ్యాన్ని మూడు దశాబ్దాల పాటు అగ్రస్థానంలో నిలిపిన హువాంగ్.. చివరకు ఒక వ్యక్తిగత వివాదంతో ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఏఐ భవిష్యత్తు ఏమో కానీ ముందు ఎన్విడియా భవిష్యత్తు ఏంటి? అని ఇన్వెస్టర్లు తలలు పట్టుకుంటున్నారు. టెక్నాలజీ ఎంత ఎదిగినా.. మనిషి బలహీనతల ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేతులెత్తేస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Tags:    
  • jensenhuang 
  • nvidia 
  • nvidiastocks 
  • aiindustry 

Similar News

అమెరికా ఆహారపు అలవాట్లలో మార్పులు.. కొత్త ఫుడ్ పిరమిడ్‌లో ఏయే ఆహారాలకు చోటు?

2026-11-12 23:30 GMT

ప్రపంచానికి పెద్దన్న.. సొంత ఇంటి గడపలో మాత్రం భద్రత సున్నా..

2026-11-12 18:29 GMT

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

అమెరికాలో ఎస్‌బీఐ విస్తరణ.. టెక్సాస్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం!

2026-11-10 07:15 GMT

న్యూజెర్సీలో దీపావళి వేడుకల తర్వాత చెత్తకుప్పలు.. పండుగ సంబరాల్లో పౌర బాధ్యత మరిచారా?

2026-11-10 07:15 GMT

ఇరాన్ పై యుద్ధం ఆపేశాడు.. వెనక్కి తగ్గేశాడు.. ట్రంప్‌కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా?

2026-11-10 06:39 GMT

జెన్సన్ హువాంగ్‌కు మస్క్, బిల్ అక్‌మన్ మద్దతు.. వివాదంపై ఎన్విడియా బోర్డు దర్యాప్తు!

2026-11-09 12:35 GMT

Copyright @2026

Powered by Blink CMS