• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆయన బీజేపీ.. ఆ పార్టీ...

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

| ఏపీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఉల్లంఘనలపై త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీంతో కూటమి ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

By - Tupaki Political Desk
Update: 2026-11-13 14:30 GMT

ఏపీలో పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ రాజ్యమేలుతోందంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. బీజేపీ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఆరోపణలు చేయడం ఆసక్తి రేపుతోంది. ఈ ఆరోపణలు ద్వారా ఆయన బీజేపీని టార్గెట్ చేస్తున్నారా? లేక కూటమిలోని ప్రధాన రాజకీయ పక్షమైన టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై గురిపెట్టారో స్పష్టత రావాల్సివుందని అంటున్నారు. గతంలో కూడా ఏపీ రాజకీయాలలో జోక్యం చేసుకున్న సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టారని అంటున్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం తర్వాత ఎక్స్ లో విమర్శలు గుప్పించడం ద్వారా ఆయన వ్యూహం ఏంటన్నది అంతుచిక్కడం లేదని చెబుతున్నారు.

ఏపీలో ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరును ప్రశ్నిస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన కనుమరుగై, అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు. ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోయిందా అని ప్రశ్నించిన ఆయన, స్థానిక ఎన్నికల సమయంలో జరిగిన అక్రమాలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం విమర్శలతో సరిపెట్టకుండా, ఈ ఎన్నికల్లో జరిగిన నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలపై తాను త్వరలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేయడం ద్వారా ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

అయితే, ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాలు వచ్చి వారం రోజులు గడిచాక సుబ్రహ్మణ్యస్వామి ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో లేదా ఫలితాలు వెలువడిన వెంటనే ఆరోపణలు చేస్తుంటాయి. కానీ, ఒక జాతీయ స్థాయి సీనియర్ రాజకీయ నాయకుడు, బీజేపీకి చెందిన నేత కొద్దిరోజుల విరామం తర్వాత ఈ రకమైన తీవ్ర విమర్శలు చేయడం ప్రభుత్వానికి ఇరుకున పెట్టే పరిస్థితిని సృష్టిస్తోంది. క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న ఘర్షణలు, నామినేషన్ల పర్వంలో తలెత్తిన వివాదాలు, ఇతర పరిణామాలపై పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఆయన ఈ వ్యూహాత్మక అడుగు వేసినట్లు స్పష్టమవుతోంది.

సుబ్రహ్మణ్యస్వామి గతంలో కూడా సీఎం చంద్రబాబు విధానాలపై బహిరంగ విమర్శలు గుప్పించిన సందర్భాలున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) పాలనాపరమైన అంశాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో 'రూల్ ఆఫ్ లా' ఉందా లేదా అని ప్రశ్నించడం ద్వారా, కూటమి ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపినట్లైందని అంటున్నారు. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీకి చెందిన సీనియర్ నేత ఈ విధంగా గళం విప్పడం గమనార్హం.

ఈ పరిణామం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సుబ్రహ్మణ్యస్వామి లాంటి సీనియర్ నేత నేరుగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం విస్మయం కలిగిస్తోందని చెబుతున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా కోర్టుకు వెళ్తామని హెచ్చరించడం వల్ల ఈ అంశం మలుపు తిరిగే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల నిర్వహణ తీరుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, మున్సిపల్ ఎన్నికలలో అక్రమాలు జరిగాయన్న అంశాన్ని మరింత హైలెట్ చేసేలా సుబ్రహ్మణ్యస్వామి రంగంలోకి దిగారని, ఈ విషయాన్ని మరింత ఎక్కువగా ప్రచారం చేసి కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బతీయాలని పావులు కదుపుతున్నారని విశ్లేషిస్తున్నారు.

Tags:    
  • subramanianswamy 
  • chandrababu 
  • andhrapradesh 
  • apelections 

Similar News

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS