• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తులం బంగారం కాదు కానీ...

తులం బంగారం కాదు కానీ కారు ఇచ్చిందెంత? పువ్వు ఇచ్చిందెంత?

By - Tupaki Desk
Update: 2022-11-05 12:30 GMT
దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా ప్రచారం జరిగిన మునుగోడు ఉప పోరు వేళ.. ప్రధాన పార్టీలు పోటాపోటీగా డబ్బుల పంపిణీ సాగినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఒకరు మునుగోడు ఓటర్లను రోడ్ల మీద ఆపి మరీ మాటలు కదిపారు. ఓటు వేసినందుకు ఎంత ఇచ్చారు? అన్న విషయాన్ని అడిగితే.. వారు అంతే ఓపెన్ గా తాము తీసుకున్న డబ్బుల లెక్కను చెప్పేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

పలువురు మహిళల్ని.. ఒకరిద్దరు పురుషులను ఉప ఎన్నిక సందర్భంగా పార్టీల నుంచి తీసుకున్న డబ్బుల లెక్కను బయటకు చెప్పేందుకు అస్సలు వెనుకాడలేదు. వారి మాటల్ని విన్నంతనే.. విలువల గురించి.. డబ్బులు పెట్టి నేతల్ని కొనటమా? ఇదెంత అన్యాయం అంటూ గుండెలు బాదేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చప్పున గుర్తుకు రాక మానదు.

విలువల గురించి అంత భారీగా మాట్లాడిన పెద్దమనిషి.. తమ పార్టీ తరఫున ఓటర్లను కొనుగోలు చేసేందుకు పంచిన డబ్బుల లెక్కల్ని చూసినప్పుడు.. మాటలకు, చేతలకు మధ్యనున్న తేడా ఇట్టే అర్థం కాక మానదు.

ఇంతకూ ఉప ఎన్నికల్లో తమ పార్టీకే ఓటు వేసేందుకు ఓటర్లకు టీఆర్ఎస్ నేతలు పంచిన పంపకాల గురించి కెమేరా సాక్షిగా ఓపెన్ అయిపోయారు. ఒక మహిళ మాట్లాడుతూ.. తొలుత టీఆర్ఎస్ వాళ్లు (కారు పార్టీ వాళ్లు) రూ.3వేలు.. మళ్లీ రెండోసారి రూ.2వేలు చొప్పున ఓటుకు పంపారని చెప్పారు. అయితే.. ఈ ఉప ఎన్నిక సందర్భంగా తులం బంగారాన్ని ఇంటికి పంచుతారని చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదని తేలింది.

ఇక.. పువ్వు గుర్తు విషయానికి వస్తే.. రూ.4వేలు ఇచ్చినట్లుగా పలువురు పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వీధుల్లోకి మైకు పట్టుకొని తిరిగేటోళ్లకు సైతం మొహమాట పడకుండా తమ మనసులోని మాటల్ని చెప్పేయటం ఆసక్తికరంగా మారింది.

కారు గుర్తు.. పువ్వు గుర్తుల వారు తమకు రూ.5 వేల.. రూ.4వేలు చొప్పున ఇచ్చారని.. అదే సమయంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని.. కేఏ పాల్ సైతం డబ్బులు తీయలేదన్న అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు.  ఇదంతా విన్నప్పుడు.. ఓట్ల కొనుగోలు విషయంలో అధికార టీఆర్ఎస్.. విపక్ష కమలనాథుల తీరును కళ్లకు కట్టినట్లుగా చెప్పేస్తున్న సామాన్యల మాటలకైనా బుద్ది వస్తుందని ఆశిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • MunugodeBypollElections 
  • BJP 
  • TRS 
  • KAPual 
  • KCR 
  • Congress 
  • Politics 
  • Munugode 
  • Money 
  • Gold 
  • PoliticalNews 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS