ఆ వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేకు పెద్ద‌చిక్కే వ‌చ్చిందా..?

Update: 2022-02-06 00:30 GMT
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన జిల్లాల విభ‌జ‌న‌చాలా చోట్ల అగ్గిని రాజేసింది. మాకు జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించిన ప్రాంతం వ‌ద్దు.. ఈ ప్రాంతాన్ని ప్ర‌తిపాదించండి. మాకు ఈ పేరు వ‌ద్దు మ‌రో పేరు పెట్టండి. మాకు ఈ ప్రాంతాన్ని జిల్లాగా కేటాయించండి! అంటూ.. ప్ర‌జ‌లు రోడ్డెక్కిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇది అటు తిరిగి , ఇటు తిరిగి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చుట్టుకుంది. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప లో అయితే... వారాల త‌ర‌బ‌డి.. ఈ ఉద్య‌మాలు ఊపందుకున్నాయి. క‌డ‌ప జిల్లాను విభ‌జించి రెండు జిల్లాలుగా ప్ర‌క‌టించారు.

వైఎస్సార్‌ కడపజిల్లాలోని కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌డ‌ప కేంద్రంగా వైఎస్సార్ క‌డ‌ప జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. అదేవిధంగా క‌డ‌ప, చిత్తూరు జిల్లాల్లోని  రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌తో రాయ‌చోటి కేంద్రంగా అన్నమయ్యజిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు. అయితే... రాయ‌చోటి కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న అన్న‌మ‌య్య జిల్లా విష‌యంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

రాయ‌చోటి కేంద్రంగా కాకుండా.. రాజంపేట కేంద్రంగా జిల్లాను ప్ర‌క‌టించాల‌ని కోరుతున్నారు. దీనిలో ఇత‌ర నాయ‌కులు.. కాకుండా.. వైసీపీ కి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులే రోడ్డెక్క‌డం చిత్రంగా క‌నిపిస్తోంది. దీనిలో ఎంపీ మిథున్‌రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసుల‌కు మ‌రింత సెగ త‌గులుతోంది. వీరిద్ద‌రిని ఇక్క‌డి వారు ప్ర‌శ్నిస్తున్నారు. రాయ‌చోటి కాకుండా.. రాజంపేట‌ను కేంద్రంగా ప్ర‌క‌టించేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాలంటూ.. పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి ఈ ఇద్ద‌రు నాయ‌కులు రోడ్డు మీద‌కు రావాల‌ని.. ఉద్య‌మంలో పాల్గొనాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయి.

ఈ సెగ‌ను భ‌రించ‌లేక‌.. ఇప్ప‌టికే కొరుముట్ల బ‌య‌ట‌కు వ‌చ్చారు. రాజంపేట కేంద్రంగా అన్న‌మయ్య  జిల్లా ఏర్పాటు చేయాలంటూ.. ఆయ‌న స్థానిక ప్ర‌జాప్ర‌తినిదుల‌తో క‌లిసి క‌రెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రం ఇచ్చారు. ఇక‌, ఎంపీ కూడా బ‌య‌ట‌కు రావాల‌ని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో కొంద‌రుభారీ ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేసి.. ``వైసీపీకి ఇక సెల‌వు`` అంటూ.. నినాదాలు రాసి పెట్ట‌డం ప‌పార్టీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే.. ఈ నెల 26 వ‌ర‌కు జిల్లాల‌పై అభ్యంత‌రాలు తీసుకునే వెసులు బాటు ఉన్న నేప‌థ్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమేర‌కు ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వానికి వినిపిస్తారో చూడాలి.
Tags:    

Similar News