• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'తక్కువ నష్టంతో కరోనా...

'తక్కువ నష్టంతో కరోనా నుండి బయటపడాలి' సీఎంలకి మోదీ దిశానిర్దేశం!

By - Tupaki Desk
Update: 2020-04-02 16:36 GMT
కరోనా వైరస్‌ ను దేశంలో అరికట్టడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కాన్ఫరెన్స్‌ లో మోడీ మాట్లాడుతూ ..కరోనా కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. దేశంలో విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడంలో విజయవంతం అయ్యామన్నారు. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు నియంత్రించేందుకు రాష్ట్రాలన్నీ ఉమ్మడిగా వ్యూహాన్ని రచించాలని కోరారు.

అలాగే కరోనా మహమ్మారి నుండి వీలైనంత తక్కువ నష్టంతో ఈ సంక్షోభం నుంచి బయటపడాలన్నారు. సంక్షోభం నుంచి బయటపడే అంశాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎంలు ధార్మిక సంస్థల నేతలతో చర్చించాలని చెప్పారు. రెండో దశలో కరోనా వైరస్‌ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయన్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు అవసరమైన ఆసుపత్రులు, మెడికల్‌ కిట్లు సమకూర్చుకోవాలని తెలిపారు. అలాగే ,పంట కోతల సమయం కనుక రైతులకు కొన్ని మినహాయింపులతో వారు పనులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, వారిని గుంపులుగా చేరకుండా చూడాలని తెలిపారు.

అలాగే ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ద్వారా కరోనా దేశంలో వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి పలు సూచనలు ఇచ్చారు. కరోనా వైరస్‌ హాట్‌ స్పాట్‌ లను గుర్తించి వాటిని ఎన్‌ సర్కిల్‌ చేయాలన్నారు. దేశంలో ఉన్న వలస కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విన్నవించారు. భౌతిక దూరం ద్వారానే వైరస్‌ వ్యాప్తి కాకుండా చూడగలమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన ద్వారా కరోనా వైరస్‌ కేసులు పెరిగిపోతుండడంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలను హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో ఏపీ  - తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.




Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

Copyright @2026

Powered by Blink CMS