జగన్ కు కేంద్రమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకూడదా?

Update: 2016-04-27 16:57 GMT
తన పార్టీ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుచేస్తున్న ఆకర్ష్ అస్త్రాన్ని ఎదుర్కొనేందుకు ‘సేవ్ ద డెమోక్రసీ’ పేరిట ఒక కార్యక్రమాన్ని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టార్ట్ చేయటం తెలిసిందే. తన తాజా కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో పలువురు ప్రముఖుల్ని కలుసుకుంటున్న ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. బాబుపై ఓ స్థాయిలో విరుచుకుపడుతున్న జగన్ పై తెలుగు తమ్ముళ్లు ఎదురుదాడి షురూ చేశారు.

ఈ సందర్భంగా జగన్ మీద పలువురు తెలుగుదేశం నేతలు విమర్శలు చేసినా.. ఏపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన విమర్శలు ఆసక్తికరంగా మారాయి. జగన్ ఆర్థిక నేరస్తుడని.. అలాంటి వ్యక్తికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ఎలా అపాయింట్ మెంట్ ఇచ్చారోఅర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. పలు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లుగా జగన్ మీద ఆరోపణలు మాత్రమే ఉన్నాయే తప్పించి.. ఆయన మీద మోపిన నేరాలు ఇప్పటివరకూ నిరూపితం కాలేదన్న విషయాన్ని రాజేంద్రప్రసాద్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది. అయినా.. ఒక రాష్ట్ర విపక్ష నేతపై కేసులు ఉన్నంతనే.. కేంద్రమంత్రి అపాయింట్ మెంట్ ఇవ్వకూడదనటం ఏమిటో..?
Tags:    

Similar News