• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎమ్మెల్సీ కవితకు టీకా.....

ఎమ్మెల్సీ కవితకు టీకా.. అదెలా సాధ్యమైంది?

By - Tupaki Desk
Update: 2021-03-30 04:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత తాజాగా వ్యాక్సిన్ వేసుకోవటం తెలిసిందే. ఇటీవల ఆమె భర్త కరోనా పాజిటివ్ గా తేలటం తెలిసిందే. తమను ఎవరూ కలవొద్దంటూ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన ఆమె.. తాజాగా నిమ్స్ లో టీకా వేయించుకున్నారు. అధికారికంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో టీకా వేయించుకున్న మొదటి వ్యక్తి కిందకు కవిత వస్తారు. ఇప్పటివరకున్న నిబంధనల ప్రకారం 45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకా వేయాల్సి ఉంటుంది. అది కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రమే.

ఒకవేళ వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే  కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్ అయి ఉండాలి. ఎమ్మెల్సీ కవిత ఆ కోవలోకి రారు. ఏప్రిల్ ఒకటి నుంచి వస్తున్న నిబంధన ప్రకారం 45 ఏళ్లు ఉన్న వారు ఎవరైనా సరే వ్యాక్సిన్ వేయించుకునేందుకు అవకాశం ఉంది. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. కేంద్రం వ్యాక్సిన్ విషయంలో ఈ వెసులుబాటు కల్పించింది. గూగుల్ చెబుతున్న లెక్క ప్రకారం ఎమ్మెల్సీ కవిత వయసు 43 సంవత్సరాలు మాత్రమే.

ఇలా ఏ రీతిలో చూసినా.. కవితకు వ్యాక్సిన్ ఎలా వేశారన్నది ప్రశ్నగా కొందరు లేవనెత్తుతున్నారు. అయితే.. కవితకు టీకాను ప్రజాప్రతినిధుల కోటాలో వేసినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. హైరిస్కు వర్గాల్లో ప్రజాప్రతినిధులు కూడా ఉంటారని.. నిత్యం వారిని వందల మంది కలుస్తుంటారని.. అందుకే ప్రజాప్రతినిధులకు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నారు. ఆసక్తికరంగా ప్రజాప్రతినిధులు ఈ అవకాశాన్ని పెద్దగా వినియోగించుకున్నట్లుగా కనిపించదు.

ఎమ్మెల్సీ కవిత వ్యాక్సిన్ వేయించుకున్న వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తుంటే.. మరోవైపు కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కమ్ రాజ్యసభ సభ్యుడైన సంతోష్ కూడా హోలీ రోజునే వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇంతకాలం వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించని కేసీఆర్ కుటుంబ సభ్యులు.. ఇప్పుడు మాత్రం ఒకే రోజు ఇద్దరు వ్యాక్సిన్ వేయించుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ సీఎం కేసీఆర్ ఎప్పుడు వేయించుకుంటారన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఆయనకు సూదిమందు అంటే అస్సలు ఇష్టముండదు. అవసరమైతే దేనికైనా సిద్ధమంటారు కానీ.. సూదిమందుకు మాత్రం వెనుకాడతారు. అందుకే.. కేసీఆర్ టీకా మాట ఆసక్తికర చర్చకు తెర తీస్తుంటుంది.
Tags:    
  • MLC Kavitha 
  • Covid 19 Vaccine 
  • Corona Virus 
  • Telugu news 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS