మంత్రుల లాబీయిస్టులు చాలా కాస్లీ గురూ!

Update: 2020-08-10 16:00 GMT
ఏ ప్రభుత్వం మారినా వారు మాత్రం చెక్కు చెదరరు. మంత్రుల చుట్టూ చేరి కమీషన్లు దండుకుంటారు. పనులు చేయిస్తూ మంత్రులకు ముట్టజెప్పుతూ పబ్బం గడుపుతుంటారు. కానీ సీఎం జగన్ పాలనలో అది కొంచెం కష్టం అవుతోంది. అయినా లాబీయిస్టులు సామధాన భేద దండోపాలు వినియోగిస్తూ మంత్రులను బట్టలో వేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది.

ఏపీ సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అవినీతి రహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. అమలు చేసి చూపించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అన్నింట్లోనూ అవినీతిని కట్టడి చేశాడు. మంత్రుల దగ్గర ఎలాంటి ఆర్థిక లాబీయింగ్ జరగకుండా స్ట్రిక్ట్ గా వ్యవహరించారు. చర్యలు చేపట్టారు. మంత్రుల బంధువులు ఎవరూ వారి ఆఫీసుల దగ్గర ఉండకూడదు అని చాలా స్టిక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు.  ఇక అవినీతి చేశారని తేలితే ఎలాంటి మొహమాటం లేకుండా తక్షణమే తీసివేశారు.

మొదటి 6 నెలలు మంత్రుల దగ్గర ఎలాంటి లాబీయిస్టులు లేరు. కానీ గత 6 నెలల నుంచి మంత్రుల దగ్గర లాబీయిస్టుల సామ్రాజ్యం ఏర్పడిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. లాబీయింగ్ లు చేస్తూ కోట్ల రూపాయల బిల్స్  దండుకున్నారు అని.. పనులు చేయకుండా వాళ్లను తిప్పుతూ ఉంటే కొంతమంది మంత్రుల మెడకు చుట్టుకొనే పరిస్థితి ఏర్పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా సీఎంవోకు చేరాయని ప్రచారం సాగుతోంది.

ఇప్పుడు దాని గురించి తెలిసింది సీఎం జగన్ మంత్రులను ఆరాతీస్తున్నట్టు తెలిసింది.. దీనికి మాకు సంబంధం లేదు అని చెప్పడానికి మంత్రులు ప్రిపేర్ అయ్యారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ను బట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పరిస్థితి ఉంటుందని రిపోర్ట్స్ వెళ్లాయని సమాచారం. ఖచ్చితంగా దీనిపై సీఎం జగన్ త్వరలోనే యాక్షన్ తీసుకోబోతున్నారని  వార్తలు వెలువడుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో లాబీయిస్టులను దరిచేరకుండా జగన్ కఠినంగా ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News