పెద్దాయన పీఎం ..చిన్నాయన సీఎం : మంత్రి
తెలంగాణలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో మరోసారి టిఆర్ ఎస్ కి రాష్ట్రంలో తిరుగులేదు అని నిరూపించుకుంది. మొత్తంగా ఈ సంచలన విజయం తరువాత టిఆర్ ఎస్ నేతలలో ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం ఎక్కువైంది. మున్సిపల్ ఎన్నికల విజయానందంలో కొంతమంది నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
సాధారణంగా లోకల్ ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీకే అనుకూలంగా వస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. మరో నాలుగు ఏళ్ళు ప్రభుత్వానికి సమయం ఉండటంతో , ప్రతిపక్షానికి చెందిన నేతలెవరూ కూడా పెద్దగా డబ్బులు పెట్టడానికి కూడా ముందుకురారు. అయినప్పటికీ కూడా తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ కి 20 శాతం ఓట్లు , బీజేపీకి 12 శాతం ఓట్లు , మిగిలిన వారికీ 15 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి అంతే మొత్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర జనాభాలో సగం మంది ఓటు వేశారు అంటే ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతె వచ్చే రోజుల్లో కష్టమే.
కానీ , మంత్రి గంగుల కమలాకర్ కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడని కమలాకర్ కొనియాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పనితీరు చరిత్ర లో నిలిచి పోతుందన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కరీంనగర్‌లో గల్లంతైందన్నారు. వచ్చే 40 ఏళ్లపాటు తెలంగాణలో తెరాసే అధికారం లో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే కేసీఆర్ ప్రధాని కావాలని దేశమంతా కోరుకుంటోంది. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి. రాష్ట్రంలో కేటీఆర్ సీఎం కావాలి అని అన్నారు. ఇదే సమయంలో పెద్దాయన పీఎం ..చిన్నాయన సీఎం అంటూ టిఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి ...