• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పురుషుడికి అమ్మ‌త‌నం...

పురుషుడికి అమ్మ‌త‌నం సాధ్య‌మేనా!

By - Tupaki Desk
Update: 2016-09-15 07:39 GMT
ప్ర‌కృతీ పురుషుడి క‌ల‌యికే సృష్టి అని శాస్త్రాలు చెబుతాయి. ప్ర‌కృతి అంటే స్త్రీ అని అర్థం. పిల్ల‌ల్ని క‌నే శ‌క్తి ఒక్క స్త్రీ జాతికి మాత్ర‌మే ఉంది. అండం పిండ‌మై మాతృగ‌ర్భంలో న‌వ‌మాసాలూ ఉన్నాయ ఈ భూప్ర‌పంచంలోకి వ‌స్తుంది. అయితే, భ‌విష్య‌త్తులో ఆ శ‌క్తి మ‌గాడికి కూడా వ‌స్తుంద‌ని బిట్ర‌న్ శాస్త్రవేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. స్త్రీ సంప‌ర్కం లేకుండానే పురుషుడు బిడ్డ‌ల్ని క‌న‌గ‌లిగే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఆ దిశ‌గా జ‌రిగుతున్న ప‌రిశోధ‌న‌ల్లో పురోగ‌తి క‌నిపిస్తోంద‌ట‌! మ‌హిళ‌ల ప్ర‌మేయం లేకుండా బిడ్డ‌ల్ని క‌నేందుకు ఒక ప్ర‌త్యామ్నాయ ప్ర‌క్రియ కోసం శాస్త్రవేత్త‌లు రీసెర్చ్ మొద‌లుపెట్టారు. మామూలుగా అయితే స్త్రీలోని అండం - పురుషుడి నుంచి విడుద‌లైన వీర్య‌క‌ణం క‌లిసి ఫ‌ల‌ధీక‌ర‌ణ చెంది పిండంగా మార‌తాయి. దీనికి ప్ర‌త్యామ్నాయంగా అండానికి బ‌దులు చ‌ర్మ క‌ణంతో వీర్యాన్ని క‌లిపి.. ఫ‌ల‌దీక‌రించి పిండాన్ని ఉత్ప‌త్తి చేయ‌బోతున్నారు.

ఈ ఆలోచ‌న ప్రస్తుతానికి కాస్త ఊహాజ‌నితంగా అనిపిస్తున్నా.. భ‌విష్య‌త్తులో నిజ‌మ‌య్యే రోజులు వ‌స్తాయ‌ని బ్రిట‌న్ సైంటిస్టులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌రిశోధ‌న‌ల్లో భాగంగా కొన్ని ఎలుక‌ల‌పై ఈ ప‌ద్ధ‌తిని ప్ర‌యోగించి చూశారు. వీర్య‌క‌ణాల‌కు అండ క‌ణాలు జ‌త‌చేసి ఎలుక‌లు ఇంజెక్ట్ చేశారు. ఆరోగ్య‌వంత‌మైన పిండాల‌ను ఉత్ప‌త్తి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. ఈ ప్ర‌యోగం విజ‌యం తర్వాత వీర్యక‌ణానికి ఇత‌ర టిష్యూ క‌ణాలు జ‌త‌చేసి పిండాన్ని ఉద్భ‌వింప‌జేయొచ్చ‌ని తేలింద‌ని చెబుతున్నారు. ఇదంతా స‌మ‌విభ‌జ‌న ప‌ద్ధ‌తిలో చేశామ‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల్లో 24 శాతం విజ‌యం సాధించామ‌నీ - భ‌విష్య‌త్తులో మ‌రింత పురోగ‌తి సాధించ‌బోతున్నాం అని విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు బ్రిట‌న్ శాస్త్రవేత్త‌లు. ఈ ప‌ద్ధ‌తి స‌క్సెస్ అయితే... ఆమెలాగ అత‌డూ త‌ల్లి కాగ‌ల‌డు! మిగ‌తావారి సంగ‌తి ఎలా ఉన్నా... స్వ‌లింగ సంప‌ర్కులు భ‌విష్య‌త్తులో డోనర్స్‌ పై ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని చెబుతున్నారు.
Tags:    
  • Men 
  • Birth to a Child 
  • Pregnant Man 

Similar News

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

Copyright @2026

Powered by Blink CMS