• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గో..దారిలో మేఘా మరో...

గో..దారిలో మేఘా మరో రికార్డు

By - Tupaki Desk
Update: 2020-02-19 07:29 GMT
గోదావరి జలాల తరలింపులో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఇప్పటికే రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా లక్ష్మీ (మేడిగడ్డ) పంపింగ్ కేంద్రం నుంచి 11 మిషన్లతో ఒకేసారి నీటిని ఎత్తిపోయడం ద్వారా మొదటిదశ పనులు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. తాజాగా లక్ష్మీ కేంద్రం పిబ్రవరి 15వ తేదీ అర్దరాత్రి నుండి ఇప్పటివరకు నాలుగు టిఎంసిల నీటిని ఎత్తిపోసింది. 11 మిషన్లు పనిచేయడం ద్వారా 22 డెలివరీ పైపు ద్వారా విడుదలైన ఆ నీరు చూపరులకు కనువిందు చేసింది. పంపింగ్ కేంద్రం నుంచి జాలువారిన నీరు రైతుల గుండెలను పులకరింపచేశాయి. లక్ష్మీ నుంచి డిసి ద్వారా విడుదలైన నీరు 13 కిలోమీటర్ల మేర కాలువలో హోయలొలుకుతూ ప్రవహించి చివరకు సరస్వతి జలాశయానికి చేరిన నీరు సముద్రాన్ని తలపిస్తూ కళ్లకు ఇంపుగా ఆకట్టుకుంటోంది.

హంద్రీ-నీవా రికార్డు బద్దలు

ఇప్పటివరకు హంద్రీ-నీవానే ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాగా అందులోని పంపింగ్ కేంద్రాలను కూడా మేఘా నిర్మించింది. ఇప్పుడు తాజాగా దాదాపు మూడేళ్ళలోపే కాళేశ్వరంలో 3436 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మిషన్లను 11 పంపింగ్ కేంద్రాలల్లో ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాని స్థాయిలో కాళేశ్వరంలో ఆచరణ సాధ్యం చేసి చూపించింది. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో హంద్రీ-నీవా ప్రాజెక్ట్ 2007లో ప్రారంభమై (అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో) ఇప్పటికీ ప్రధానమైన నిర్మాణాలన్నీ పూర్తికాగా మరో రెండు పంప్హౌస్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అంటే పుష్కరకాలం దాటిపోయింది. తెలంగాణలో మాత్రం అంతకన్నా భారీ ప్రాజెక్టు ను మూడేళ్ళలోపే ప్రభుత్వ పట్టుదల వల్ల ఎంఇఐఎల్ పూర్తి చేయగలిగింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు ఉండగా ఎంఇఐఎల్ మాత్రమే 17 పంప్ హౌస్లను నిర్మిస్తోంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పథకాలకు ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ప్రపంచ చరిత్రలోనే కేవలం 59 మిషన్ల ద్వారా 3436 మెగావాట్ల సామర్థ్యంతో పంపింగ్ కేంద్రాలు నిర్మించడం అనేది ఇంతవరకు ఎక్కడా సాధ్యం కాలేదు. హంద్రీ-నీవాలో 43 పంపింగ్ కేంద్రాలల్లోని 269 మిషన్ల ద్వారా దాదాపు 653 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపింగ్ వ్యవస్థను మేఘా ఏర్పాటు చేయడమే ప్రపంచంలో పెద్దదిగా రికార్డులకెక్కగా ఇప్పుడు కాళేశ్వరం మొదటిదశలో 6 రెట్లు ఎక్కువగా అంటే 3436 మెగావాట్ల సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది.

మేఘా పంపింగ్ కేంద్రాలు

కాళేశ్వరం ద్వారా 7200 మెగావాట్ల సామర్థ్యంతో 3 టిఎంసీల నీటిని రోజుకు పంప్ చేసే విధంగా పనులు జరుగుతుండగా అందులో 2 టిఎంసీల నీటిని రోజుకు పంప్ చేయడానికి 4992 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలతో పాటు అంతే విద్యుత్ సరఫరా అవసరం అవుతుంది. ఇందులోనూ అత్యధిక భాగం మేఘానే పూర్తిచేసింది. 11 పంపింగ్ కేంద్రాల్లో 59 మిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా 3436 మెగావాట్లు రెండున్నరేళ్ళ కాలంలో నిర్మించడం మరో ఇంజనీరింగ్ వండర్గా గుర్తింపు పొందింది. పంపింగ్ కేంద్రాల నిర్మాణంలో ఇంతవరకు దరిదాపుల్లో మరే ప్రాజెక్ట్ కూడా లేదు. అయితే మొదటిదశలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంప్ హౌస్లను పూర్తిగా వినియోగిస్తుడడంతో దాదాపు 50 టిఎంసీల నీటిని మిడ్ మానేరు పంప్చేసి అక్కడి నుంచి లోయర్ మానేరుకు విడుదల చేశారు. తాజాగా మళ్ళీ లక్షీ కేంద్రం నుంచి 11 మిషన్లతో పంపింగ్ ప్రారంభించగా సరస్వతి, పార్వతి కేంద్రాల నుంచి కూడా పూర్తిస్థాయిలో పంపింగ్ కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే సరస్వతిలో 4 మిషన్లు పంపింగ్ చేస్తున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్ కేంద్రంగా పేరొందిన గాయత్రి లక్ష్మీపూర్ పంపింగ్ కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో 7 మిషన్లను వినియోగిస్తూ నీటిని మిడ్ మానేరుకు పంప్ చేస్తున్నారు. మొదటిదశలో 2 టిఎంసీల నీటిని పంప్ చేయాలనే ప్రభుత్వ లక్ష్యం లక్ష్మీ (మేడిగడ్డ) నుంచి మిడ్ మానేరు వరకు అనతికాలంలోనే సాధ్యమైంది. ఇదే ప్రాజెక్ట్ లో ప్యాకేజీ -21,27,28 తో పాటు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ పంపింగ్ కేంద్రాల్లో మిషన్ల ఏర్పాటు పూర్తయ్యాయి. అయితే ఈ కేంద్రాల నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభం కాలేదు. అలాగే లక్ష్మీ కేంద్రంలో ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 11 మిషన్లు ఏర్పాటు కాగా సరస్వతి కేంద్రంలో 8, పార్వతి కేంద్రంలో 9 మిషన్లు వినియోగంలోకి వచ్చాయి. వీటి సామర్థ్యం కూడా ఒక్కొక్కటి 40 మెగావాట్లు. భూగర్భలో 470 అడుగుల దిగువన నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద పంపింగ్ కేంద్రంలో 973 మెగావాట్ల సామర్థ్యంతో మిషన్లు పూర్తిగా నీటిని ఎత్తిపోస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎంఇఐఎల్ ప్రధానంగా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పనులు చేయగా అందుకు అవసరమైన పంపింగ్ మిషన్లను బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజీనిరింగ్ సంస్థలు సమకూర్చాయి. ఈ ప్రాజెక్ట్ లోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్ పంపింగ్ కేంద్రాల్లో మొత్తం 8 మిషన్లకు గాను ఇప్పటికే 5 పూర్తయ్యాయి. మరో మూడు నిర్మాణ దశలో ఉన్నాయి. మిడ్మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు నీటిని రోజుకు రెండు టిఎంసీల చొప్పున తీసుకువచ్చేందుకు అవసరమైన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గత ఏడాది జూన్లో కాళేశ్వరం నుంచి నీటి పంపింగ్ ప్రారంభించగా ఇప్పటికీ మొదటి దశలో రెండు టిఎంసీల నీటిని లింక్-1, లింక్-2ల్లో పూర్తిచేశారు.

విద్యుత్ సరఫరాలోనూ రికార్డులు

కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4627 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవసరం కాగా అందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ అనతికాలంలోనే నిర్మించి చరిత్ర సృష్టించింది. ఇందులో 400 కేవీ, 220 కేవీ సామర్థ్యం కలిగిన ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లు, దాదాపు 260 కిలోమీటర్ల మేర ట్రాన్స్ మిషన్ లైన్లను ఎంఈఐఎల్ కేవలం రెండేళ్ల కాలంలో పూర్తిచేసింది. ఈ పథకంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంతపెద్దదంటే.. తెలంగాణ రాష్ట్ర మొత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్థ్యం దాదాపు 16 వేల మెగావాట్లు. దీనితో పోల్చితే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన సరఫరా వ్యవస్థ మొత్తం తెలంగాణ విద్యుత్ సరఫరా వ్యవస్థలో పావువంతు ఉందంటే ఇది ఎంత భారీ వ్యవస్థో అర్థం చేసుకోవచ్చు.

కాళేశ్వరానికి 'మేఘా' ప్రాణం

అతి తక్కువ సమయంలోనే మేఘా పంపింగ్ కేంద్రాలు 44 టిఎంసీల నీటిని ఎత్తిపోశాయి. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ నీటిని పంప్ చేయడం కూడా ఓ రికార్డ్. లక్ష్మీ పంప్ హౌస్ ద్వారా 37.16 టిఎంసీలు, సరస్వతి పంప్ హౌస్ ద్వారా 32 టిఎంసీల నీరు ఎత్తిపోయడం, పార్వతి పంప్హౌస్ నుంచి దాదాపు 30 టిఎంసీల నీటిని ఎత్తిపోశాయి. మిగిలిన పంప్ హౌస్లతో పోలిస్తే గాయత్రీ నుంచి అధికంగా నీరు అందించడానికి కారణం దీని సామర్థ్యం ఎక్కువ కావడంతో పాటు దిగువన ఉన్న శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి జలశయానికి ఎగువ నుంచి గోదావరి వరద నీరు కూడా లభించింది. ఎల్లంపల్లికి లింక్-1లోని పార్వతి నుంచి నీటిని పంప్ చేయడమే కాకుండా గోదావరి నుంచి సహజ సిద్ధంగా వచ్చిన ప్రవాహం కూడా గాయత్రికి చేరడంతో ఇక్కడ మిగిలిన పంపింగ్ కేంద్రాలకన్నా ఎక్కువ నీటిని ఎగువకు ఎత్తిపోయడం సులభం అయ్యింది.
Tags:    
  • Godavari Districts 
  • Megha Engineering And Infrastructure Limited 
  • Megha Projects In Godavari Districts 
  • Megha Project Details 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS