• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శృతిమించిన మేకప్...

శృతిమించిన మేకప్ అంతపనిచేసింది!

By - Tupaki Desk
Update: 2016-10-19 19:30 GMT
ఏమాటకామాట చెప్పుకోవాలంటే అమ్మాయిల మేకప్ పై రకరకాల కామెంట్స్ నిత్యం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంటాయి! వాటికి బలం చేకూరుస్తూ... విత్ మేకప్ - వితౌట్ మేకప్ అంటూ హీరోయిన్స్ ఫోటోలు కూడా సోషల్ నెట్ వర్క్స్ లో వైరల్ అవుతుంటాయి. ఆ విషయాలు కాసేపు పక్కనపెడితే కేవలం మేకప్ లేకుండా తన భార్యను చూసి షాక్ తిని విడాకుల వరకూ వెళ్లిన ఒక అమాయకుడైన భర్త కథే ఈ వార్త!

యూఏఇ లోని ఒక వ్యక్తి పెళ్లిచూపులకోసం వెళ్లాడు... అక్కడ అమ్మాయి చూశాడు - ఆమె అందానికి ముగ్ధుడైపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి చేసేసుకున్నాడు. ఆమె అందాన్ని ఆస్వాధిస్తూ తన సంసారం హాయిగా సాగిపోతుంది. అంతవరకూ బాగానే ఉంది కానీ... వీరి ఆనందాల్లో భాగంగా షార్జాలోని అల్ మంజార్ బీచ్ లో ఇద్దరూ స్విమ్ చేద్దామని నిర్ణయించుకుని వెళ్లారు.. స్విమ్మింగ్ పూర్తయ్యింది.. ఆమె బయటకు వచ్చింది.. వెంటనే ఆమెను చూసిన ఆ భర్త షాక్ తిన్నాడు - వెంటనే విడాకులకు అప్లై చేశాడు. కారణం ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది... ఆ జలకాలటలలో ఆమె మేకప్ మొత్తం చెరిగిపోయింది.

నకిలీ కనురెప్పలతో సహా అనేక రకాల మేకప్ సామగ్రి వాడితేనే ఆమె తనకు మామూలుగా కనిపించి ఉంటుందని, తీరా విత్ అవుట్ మేకప్ చూస్తే ఆమె అసలు రంగు తెలిసిందని సదరు భర్త వాపోతున్నాడట. మేకప్ లేకుండా ఆ మహిళ విశ్వరూపాన్ని చూసిన ఆ వ్యక్తి మరో మాట లేకుండా విడాకులు తీసుకున్నాడట. ఈ పరిస్థితుల్లో తగిలన షాక్ కి ఆమె కూడా విడాకులు తీసుకున్న తర్వాత తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ డాక్టర్ అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టు వద్దకు వెళ్లిందట.

కాగా, మేకప్ విషయంలో ఆమె మరీ శృతిమించిపోయిందని, ఈక్రమంలో కృత్రిమ కనురెప్పలు పెట్టుకోవడంతో పాటు పెళ్లికి ముందు పలురకాల కాస్మొటిక్ సర్జరీలు కూడా చేయించుకుందని తెలుస్తోంది. ఈ విషయాలపై స్పందించిన ఆమె... తన భర్తకు ఏదో ఒక సమయంలో వాస్తవం చెబుదామని ప్రయత్నించానని, అయితే అప్పటికే బాగా ఆలస్యం అయిపోయిందని చెప్పింది. ఈ విషయం తెలుసుకున్నవారు మాత్రం... మేకప్ లేకుండా చూసి విడాకులు ఇచ్చేశాడంటే పెళ్లి చూపులు - పెళ్లి టైం లో ఆమె ఏస్థాయి మేకప్ వేసుకుని ఉంటుందో కదా అని ఆశ్చర్యపోతున్నారట!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Man 
  • wife 
  • Without make-up 
  • Telugu NEWs 

Similar News

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

Copyright @2026

Powered by Blink CMS