• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్బరుద్దీన్ పై దాడి...

అక్బరుద్దీన్ పై దాడి చేసిన పహిల్వాన్ మృతి

By - Tupaki Desk
Update: 2020-02-11 06:45 GMT
హైదరాబాద్ పాతబస్తీలో పహిల్వాన్లకు కొరత లేదు. చాలామంది ఉంటారు. కానీ.. ఒక పహిల్వాన్ తాజా మృతి ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. అందరూ ఆసక్తికరంగా చర్చించుకునే పరిస్థితి. ఎందుకంటే.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు.. అక్బరుద్దీన్ పై ఎనిమిదేళ్ల క్రితం కత్తిపోట్లు పొడిచిన కేసులో ఈ పహిల్వాన్ కూడా ఒక నిందితుడు. ఈ కారణంతోనే అతగాడి మరణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనారోగ్యం తో కొద్ది రోజులుగా యశోదా ఆసుపత్రి లో ఉన్న మహ్మద్ ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

ఎనిమిదేళ్ల క్రితం అక్బరుద్దీన్ పై కత్తితో దాడులు జరిగాయి. ఈ ఘటనలో అక్బరుద్దీన్ శరీరంలో రెండు బుల్లెట్లు.. 17 కత్తిపోట్లు దిగాయి. దీంతో.. ఎమ్మెల్యేల గన్ మెన్లు కూడా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అక్బరుద్దీన్ ను హుటాహుటిన కేర్ ఆసుపత్రి కి తరలించారు.

ఈ సమయంలో అక్కడి వైద్యులు అక్బరుద్దీన్ శరీరంలో దిగిన ఒక బుల్లెట్ ను బయటకు తీస్తే.. మరొకటి అలానే ఉంచేశారు. ఇప్పటికి అక్బరుద్దీన్ బాడీలోనే మరో బుల్లెట్ ఉంది. కత్తిపోట్ల కారణంగా అక్బరుద్దీన్ ఆ తర్వాత కాలంలో అనారోగ్యగానికి గురయ్యారు. విదేశాల్లోనూ వైద్య చికిత్సలు చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పటికి ఆయన ఆరోగ్యం కుదుటపడలేదని చెబుతారు.

ఇదిలా అక్బరుద్దీన్ పై దాడి కేసులో నిందితుడైన మహ్మద్ పహిల్వాన్ ను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలం జైల్లో ఉన్నారు. తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చారు. తాజాగా గుండె పోటుతో మరణించినట్లు గా చెబుతున్నారు. అక్బరుద్దీన్ దాడి కేసులో కోర్టు తీర్పు రాక ముందే.. నిందితుడు మరణించటం గమనార్హం.
Tags:    
  • Mahammad Pahilwan Died who attacked Akbaruddin 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Daily News 
  • Telugu News 
  • Telugu Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS