• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అప్ప‌టివ‌ర‌కు మూక‌దాడులు...

అప్ప‌టివ‌ర‌కు మూక‌దాడులు ఆగ‌వు:ఆరెస్సెస్

By - Tupaki Desk
Update: 2018-07-24 10:25 GMT
దేశంలో మూక‌దాడులు వ‌ల్ల ఎంతో మంది అమాయ‌కులు అశువులు బాస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో, నానాటికీ పెరిగిపోతున్న మూక‌దాడులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. దేశవ్యాప్తంగా మూకోన్మాద ఘటనలు - దాడుల‌ను అడ్డుకునేందుకు నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దానికోసం రెండు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఓ ప‌క్క కేంద్రం ...మూకోన్మాదంపై ఉక్కుపాదం మోసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతోంటే...మ‌రోప‌క్క ఆ దాడుల గురించి (ఆరెస్సెస్‌) కీలక నేత ఇంద్రేష్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులను చంపడం (గోవధ) ఆపేసిన‌పుడే...మూక‌దాడులూ ఆగిపోతాయ‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజస్థాన్ లోని అల్వార్ లో అన్వ‌ర్ అనే వ్య‌క్తి మూక‌దాడిలో చ‌నిపోయిన ఘ‌ట‌న‌పై  ఇంద్రేష్ ఈ విధంగా స్పందించారు. ఎవ‌రిపై అయినా దాడులు చేయ‌డం అనేది హేయమైన చర్య అని, అయితే, ఆవులను చంపాలని ఏ మతం చెప్ప‌ద‌ని అన్నారు.

క్రైస్తవులు ఆవును గోమాతగా పిలుస్తార‌ని - యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించడమే అందుకు కారణమ‌ని అన్నారు. మక్కా-మదీనాలో ఆవులను చంపడంపై నిషేధం ఉందని గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో గోవధను నిషేధించి..దానిని పాటించినపుడే  మూకదాడులు - హత్యాకాండ - వంటివి జ‌ర‌గ‌వ‌ని ఇంద్రేష్‌ అభిప్రాయపడ్డారు. మ‌రోవైపు - స్వామి అగ్నివేష్‌ పై జరిగిన దాడిని ఇంద్రేష్‌ ఖండించారు. కాగా, మూక హ‌త్య‌ల‌ను నివారించేందుకు కేంద్రం 2 క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సుష్మాస్వరాజ్‌ - రవిశంకర్‌ ప్రసాద్‌ - నితిన్‌ గడ్కరీ - టీసీ గెహ్లాట్‌ సభ్యులుగా జీఓఎంను ఏర్పాటు చేశారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నలుగురు సభ్యులతో ఉన్న అధికారుల కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఈ కమిటీ ప్రస్తుతం భారత శిక్షా స్మృతిలో ఉన్న‌ నిబంధనలను అధ్యయనం చేసి, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కొత్త నిబంధ‌న‌ల‌ను మంత్రుల సంఘానికి 15 రోజుల్లోగా సిఫారసు చేస్తారు. మంత్రుల కమిటీ తన నివేదికను ప్రధానికి సమర్పిస్తుంది.
Tags:    
  • Lynchings 
  • People 
  • Eating beef 
  • RSS leader 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS